Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరు సినిమా షురూ... గురువారం షూటింగ్ స్టార్ట్...

చిరంజీవి 150వ సినిమా సెట్‌పైకి ఎప్పుడెప్పుడు వస్తుందా! అనే ఆతృత ఆయన అభిమానులతోపాటు బయట ప్రజల్లోనూ ఆసక్తిగా వుంది. లెక్కప్రకారం ఈ నెల 23.. అంటే గురువారంనాడు షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలిసింది. రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినాయక్‌ దర్శకుడు

చిరు సినిమా షురూ... గురువారం షూటింగ్ స్టార్ట్...
, బుధవారం, 22 జూన్ 2016 (21:56 IST)
చిరంజీవి 150వ సినిమా సెట్‌పైకి ఎప్పుడెప్పుడు వస్తుందా! అనే ఆతృత ఆయన అభిమానులతోపాటు బయట ప్రజల్లోనూ ఆసక్తిగా వుంది. లెక్కప్రకారం ఈ నెల 23.. అంటే గురువారంనాడు షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలిసింది. రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినాయక్‌ దర్శకుడు. ఇప్పటికే 20 వెర్షన్‌ల స్క్రిప్ట్‌ను తయారుచేసుకున్నట్లు తెలుస్తోంది.
 
వాస్తవానికి కత్తి రీమేక్‌ అయినా.. తెలుగు నేటివిటీకి కొంచెం మార్చి తీస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గురువారంనాడు కేవలం చిరంజీవిపై కొన్ని సన్నివేశాలను తీస్తున్నట్లు తెలుస్తోంది. రెండు పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం చిరు కెరీర్‌కు ఎలా హెల్ప్‌‌ అవుతుందో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌ అందుకే దర్శకుడ్ని మార్చాడా...?!