Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీజ క్లాస్ మేట్ కళ్యాణ్‌నే చేసుకోబోతోందట: మార్చిలో పెళ్లి.. చిరు హ్యాపీ హ్యాపీ!

శ్రీజ క్లాస్ మేట్ కళ్యాణ్‌నే చేసుకోబోతోందట: మార్చిలో పెళ్లి.. చిరు హ్యాపీ హ్యాపీ!
, ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (11:50 IST)
మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. మెగా ఇంట్లో పెళ్ళి సందడి మొదలైన వేళ.. ఇటీవల ఓ హోటల్‌లో శ్రీజ నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. చిరంజీవి తన కుమార్తె రెండో వివాహం చేసుకున్నా.. శ్రీజ భవిష్యత్తు కోసం అంతా తానై ముందుండి చూసుకుంటున్నారు. అయితే ఇంతవరకు శ్రీజ చేసుకోబోయే వరుడు ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే తాజాగా అతని డీటెల్స్ బయటికి వచ్చేశాయి.
 
శ్రీజ తన క్లాస్ మేట్ అయిన కళ్యాణ్‌నే పెళ్ళి చేసుకోబోతుందట. చిత్తూరుకు చెందిన వ్యాపారవేత్త కిషన్ కుమారుడే కళ్యాణ్. తన గురించి అన్నీ తెలిసిన వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలని శ్రీజ నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని చిరంజీవికి కూడా చెప్పింది. శ్రీజ కోసం చిరంజీవి కళ్యాణ్ కుటుంబీకులతో చర్చలు కూడా జరిపారు. పెళ్లి ఫిక్స్ చేశారు. దీంతో శ్రీజ, కళ్యాణ్ వివాహం అట్టహాసంగా జరుగనుంది.
 
మార్చిలో వీరిద్దరి పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. తన ముద్దులకూతురు వివాహాన్ని అట్టహాసంగా నిర్వహించాలని చిరంజీవి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచే అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu