Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అభిమానిపై చిరు ఫైర్.. స్టుపిడ్ ఫెలోస్ అంటూ తిట్లు.. యూ ట్యూబ్‌లో హల్‌చల్

అభిమానిపై చిరు ఫైర్.. స్టుపిడ్ ఫెలోస్ అంటూ తిట్లు.. యూ ట్యూబ్‌లో హల్‌చల్
, గురువారం, 8 అక్టోబరు 2015 (16:13 IST)
మెగాస్టార్‌ చిరంజీవికి అభిమానులంటే అమితమైన ప్రేమ. అలాంటి అభిమానిపై ఈ స్టార్ మండిపడ్డారు. స్టుపిడ్ ఫెలోస్ అంటూ ఫైర్ అయ్యారు. చిరంజీవి ఈ విధంగా ప్రవర్తించడం గతంలో ఎన్నడూ చూసి ఎరుగరు. కానీ, ఆ అభిమాని చేసిన పనికి చిరంజీవికి ఎక్కడాలేని కోపం రావడంతో ఆ విధంగా మండిపడ్డారు.
 
ఇటీవల చిరంజీవి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. సదరు అభిమాని పదేపదే నమస్తే పెట్టడం ఆయనకు చిరాకు కలిగించింది. కార్యక్రమం ముగిశాక తన కారు ఎక్కే సమయంలో కూడా ఆ అభిమాని మెగాస్టార్‌కు తారసపడి నమస్తే పెట్టాడు. ఆ తర్వాత ఓ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో భద్రతా సిబ్బంది ఆ అభిమానిని పక్కకు నెట్టేశారు. 
 
అయితే, ఆ అభిమాని చేసిన పనికి చిరంజీవి అప్పటికే ఆగ్రహంతో ఉండటంతో అతన్నిచూడగానే కోపం కట్టలు తెంచుకుంది. "ఎన్నిసార్లు దండం పెడుతావ్… నేను చూసినప్పుడల్లా ఇలా చేయిఎత్తి దండం పెడుతావ్. స్టుపిడ్ ఫెలోస్" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవికి ఒక్కసారిగా కోపం రావడంతో అక్కడున్న వారు కూడా అవాక్కయ్యారు. అయితే దీన్ని ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలోకి అప్‌లోడ్ చేయడంతో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.



 

Share this Story:

Follow Webdunia telugu