Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవి ఇంట పెళ్ళి సందడి.. శ్రీజ ఐ మిస్ యూ.. పెళ్ళి మార్చి 28కి వాయిదా..?! (ఫోటోలు)

చిరంజీవి ఇంట పెళ్ళి సందడి.. శ్రీజ ఐ మిస్ యూ.. పెళ్ళి మార్చి 28కి వాయిదా..?! (ఫోటోలు)
, శనివారం, 20 ఫిబ్రవరి 2016 (12:00 IST)
మెగాస్టార్ చిరంజీవి ఇంట పెళ్ళి పనులు జోరందుకున్నాయి. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ పెళ్ళి వేడుకల కోసం సర్వం సిద్ధమవుతోంది. మొన్నటివరకు శ్రీజ-కళ్యాణ్ వివాహం ఫిబ్రవరి 25న జరుగుతుందని వార్తలొచ్చాయి. తాజాగా శ్రీజ పెళ్లి మార్చి 28కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. శ్రీజ తన గురించి అన్ని విషయాలు తెలిసిన క్లాస్ మెట్ కళ్యాణ్‌ను వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో అందరూ తన పెళ్ళి పనుల్లో బిజీగా ఉంటే శ్రీజ మాత్రం రిలాక్స్ అవుతోంది. సోదరుడు వరుణ్ తేజ్‌తో శ్రీజ దిగిన ఫోటోను తేజ్ తన ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. తన సిస్టర్‌ను మిస్ అవుతున్నాననే బాధ వరుణ్ తేజ్ తెలిపాడు. శ్రీజ వివాహానికి అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ షూటింగ్ కారణంగా ఈ పెళ్లికి హాజరుకాకపోవచ్చునని సమాచారం. ఈ విషయాలన్నింటినీ పక్కనబెడితే అసలు శ్రీజ పెళ్లి గురించి ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అంతేగాకుండా శ్రీజ, కళ్యాణ్ ఫోటో కూడా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. 
 
ఇకపోతే వరుడు కనుగంటి కళ్యణ్ ఎన్నారై ఫ్యామిలీ అనుకున్నా.. అతని తల్లిదండ్రులు కృష్ణ, జ్యోతి హైదరాబాదుకు చెందినవారు కావడం గమనార్హం. కళ్యాణ్ బిట్స్ ఫిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 

webdunia



webdunia



webdunia


webdunia


webdunia




 

 

Share this Story:

Follow Webdunia telugu