Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఠాగూర్ సెంటిమెంట్.. కత్తితో హిట్టే.. చిరంజీవి హ్యాపీ హ్యాపీ!

ఠాగూర్ సెంటిమెంట్.. కత్తితో హిట్టే.. చిరంజీవి హ్యాపీ హ్యాపీ!
, గురువారం, 8 అక్టోబరు 2015 (13:15 IST)
చిరంజీవి 150వ సినిమాకు రంగం సిద్ధమైపోయింది. ఇక ప్రకటనే తరువాయి. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలో చిరు సతీమణి సురేఖ అధికారికంగా ప్రకటన చేస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కత్తి రీమేక్‌గా తెరకెక్కబోయే చిరంజీవి 150వ సినిమా తప్పకుండా హిట్టేనని సినీ పండితులు అప్పుడే తేల్చేస్తున్నారు. అయితే ఇందుకు కారణం కూడా లేకపోలేదు. 
 
చిరంజీవి 12 సంవత్సరాల క్రితం మురుగదాస్ తమిళంలో తెరకెక్కించిన రమణ సినిమానే తెలుగులో ఠాగూర్‌గా తీసి హిట్ కొట్టారు. ఆ సినిమాకు కూడా వినాయక్ దర్శకుడు. చిరంజీవి సతీమణి సురేఖ సహ నిర్మాత. ప్రస్తుతం మళ్లీ అదే కాంబినేషన్‌లో అదే దర్శకుడు రూపొందించిన కత్తి సినిమా రీమేక్లోనూ చిరంజీవి నటిస్తుండటం విశేషం. అప్పట్లో ఈ కాంబినేషన్ హిట్ కావడంతో తప్పకుండా కత్తికి కూడా పాజిటివ్ టాక్ వస్తుందని సినీ పండితులు భావిస్తున్నారు. 
 
ఇకపోతే.. రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో వచ్చిన కత్తి కోలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది. వందకోట్ల క్లబ్‌లో చేరింది. ప్రస్తుతం చిరు రీ ఎంట్రీ ఇచ్చే కత్తి కూడా తప్పకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. ఈ సినిమాను వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా.. చరణ్ నిర్మిస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu