Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాక్షన్‌లో చిరంజీవి... ఖైదీ నెం. 150 కోసం...

చిరంజీవి నటిస్తున్న ''ఖైదీ నెం 150' చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలు జరుగుతునానయి. చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హైదరాబాద్‌లో క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. కీలక ఫైట్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ పోరాట సన్నివేశాన్ని దర్శకుడు వినాయక్‌ చాలా జాగ్రత్

యాక్షన్‌లో చిరంజీవి... ఖైదీ నెం. 150 కోసం...
, సోమవారం, 7 నవంబరు 2016 (21:51 IST)
చిరంజీవి నటిస్తున్న ''ఖైదీ నెం 150' చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలు జరుగుతునానయి. చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హైదరాబాద్‌లో క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. కీలక ఫైట్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ పోరాట సన్నివేశాన్ని దర్శకుడు వినాయక్‌ చాలా జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్‌‌ను ప్రత్యేకంగా తమిళ టాప్‌ స్టంట్‌ మాస్టర్‌ అయిన కనల్‌ కణన్‌ కంపోజ్‌ చేశారు. 
 
గతంలో 'స్టాలిన్‌, నాయక్‌, మిర్చి, లెజెండ్‌' సినిమాలకి ఫైట్స్‌ కంపోజ్‌ చేశారు. సెంటిమెంట్‌గా ఆయన్నే పిలిపించుకున్నారు. రాయ్‌ లక్ష్మి ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసింది. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌‌గా నటిస్తోంది. కొణిదల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రాంచరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య మరో పెళ్లి చేసుకున్నా తాను చేసుకోనంటున్న హీరో... ఏం జరిగిందో?