Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవి నోట రకుల్ ప్రీత్ సింగ్ మాట: రకుల్ బ్యూటీఫుల్ హీరోయిన్.. సెన్సువల్..!

చిరంజీవి నోట రకుల్ ప్రీత్ సింగ్ మాట: రకుల్ బ్యూటీఫుల్ హీరోయిన్.. సెన్సువల్..!
, శనివారం, 3 అక్టోబరు 2015 (13:11 IST)
టాలీవుడ్‌లో భారీ ఆఫర్లు చేజిక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. బ్రూస్ లీ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ హీరోగా నటిస్తుండగా, చిరంజీవి గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుక శుక్రవారం అట్టహాసంగా జరిగింది. 
 
ఈ ఆడియో వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ అని పొగిడేశారు. అంతటితో ఆగకుండా రకుల్ సెన్సువల్ బ్యూటీ, ఎట్రాక్టివ్ గర్ల్ అంటూ కొనియాడారు. ఓ వైపు మెగాస్టార్ ఇలా ఓపెన్‌గా పొగిడేస్తుంటే రకుల్ షాక్‌కి గురైంది. తనలో తానే మదనపడిపోయింది. పక్కనే ఉన్న చెర్రీ ముసిముసిగా నవ్వేసుకున్నాడు. రకుల్ మాత్రం చాలా ఆశ్చర్యంగా అంత పెద్ద హీరో తనని ఇంత పొగిడేశారేంటబ్బా అనుకుంటూ స్టన్నయిపోయింది.
 
మెగాస్టార్ ఎంతగానో ఇంప్రెస్ అయితే కానీ ఇలాంటి పదజాలం ఉపయోగించరు. అప్పట్లో రచ్చ ఆడియో ఫంక్షన్లో మిల్కీ బ్యూటీ తమన్నాను కొనియాడిన మెగాస్టార్, ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక మెగా ప్రశంసలకు రకుల్ ప్రీత్ సింగ్ ఉబ్బితబ్బిబవుతోంది. కాగా చిరంజీవి ప్రశంసల ద్వారా రకుల్‌కు మెగాస్టార్ 150వ సినిమాలో ఛాన్స్ లభించే అవకాశాలు లేకపోలేదని సినీ పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu