Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో వివాదంలో రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్, 28 మంది డ్రైవర్లు ఆందోళన...

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్ మరో వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కొచ్చాడియాన్ చిత్రానికి సంబంధించి ఆమెపై ఓ వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమం పాఠశాలకు సంబంధించి 28 మం

మరో వివాదంలో రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్, 28 మంది డ్రైవర్లు ఆందోళన...
, మంగళవారం, 20 డిశెంబరు 2016 (20:58 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్ మరో వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కొచ్చాడియాన్ చిత్రానికి సంబంధించి ఆమెపై ఓ వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమం పాఠశాలకు సంబంధించి 28 మంది డ్రైవర్లకు జీతభత్యాలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారంతా కలిసి పాఠశాల ఆవరణలో ఆందోళన చేయడం చర్చనీయాంశమైంది. 
 
తమకు ప్రతి నెలా 25 నుంచి 29 తేదీల మధ్య జీతం వచ్చేదనీ, అలాంటిది గత ఆరు నెలలుగా సక్రమంగా జీతాలు రావడం లేదని ఆరోపిస్తున్నారు. ఐతే యాజమాన్యం మాత్రం మోదీ నోట్ల రద్దు ప్రభావంతో జీతాలు ఆలస్యమవుతున్నట్లు చెపుతున్నారు. ఐతే ఈ వాదనను వారు తోసిపుచ్చుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెట్లో కాటమరాయుడు ఫోటోలు.. తమ్ముళ్లతో అన్నయ్య నాన్ వెజ్ తింటూ...