Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళంలో మంత్ర 2: హారర్ మూవీతో భయపెట్టేందుకు ఛార్మీ రెడీ

తమిళంలో మంత్ర 2: హారర్ మూవీతో భయపెట్టేందుకు ఛార్మీ రెడీ
, గురువారం, 2 జులై 2015 (11:52 IST)
హారర్ మూవీ మంత్ర 2తో తమిళ ప్రేక్షకులను భయపెట్టేందుకు కూడా అందాల ఛార్మీ రెడీ అవుతుంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న మంత్ర 2ను తమిళంలో రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో హారర్ సినిమాలకు విపరీతమైన ఆదరణ పెరగడంతో పాటు ఛార్మీ గత చిత్రం మంత్ర తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ అనూహ్య విజయాన్ని సాధించింది. ఇదే తరహాలో మంత్ర కూడా తమిళంలోనూ రిలీజ్ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. 
 
ఇక ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన సతీష్, ఇది మంత్ర సినిమాకి మించిన ఉత్కంఠను కలిగిస్తుందన్నాడు. గ్లామర్, అభినయం విషయంలోను ఛార్మీకి ఎలాంటి వంక పెట్టలేమనీ, ఈ సినిమాతో మరో సక్సెస్ ఆమె ఖాతాలోకి చేరడం ఖాయమనే అభిప్రాయపడ్డారడు. ఇటీవల జ్యోతిలక్ష్మీగా సందడి చేసిన ఛార్మీ .. మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి చేస్తోన్నప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu