Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రకుల్ ప్రీత్ సింగ్ అప్సెట్ అయ్యిందా.. చెర్రీ ఏం చేశాడు..?

రకుల్ ప్రీత్ సింగ్ అప్సెట్ అయ్యిందా.. చెర్రీ ఏం చేశాడు..?
, సోమవారం, 5 అక్టోబరు 2015 (12:15 IST)
రామ్ చరణ్ రకుల్ ప్రీత్ సింగ్ అప్సెట్ కావడానికి కారణమయ్యాడట. ఇంతకీ రకుల్ అప్సెట్ అయ్యేలా చెర్రీ ఏం చేశాడంటే..? కృతి కరబందపై ప్రశంసల జల్లు కురిపించాడు. కన్నడ సినీ రంగంలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కృతి.. బ్రూస్ లీ సినిమాలో తనకు అక్క పాత్ర పోషించేందుకు అంగీకరించడంపై చెర్రీ కొనియాడాడు. 
 
ఈ రోల్ చేసేందుకు ఒప్పుకున్న కృతికి ఈ సినిమా యూనిట్ ఎంతో రుణపడి ఉందని చెర్రీ చేసిన కామెంట్స్‌తో రకుల్ ప్రీత్ సింగ్ షాక్ అయ్యింది. ప్రస్తుతం నడుస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ హవాతో పోలిస్తే కృతి క్రేజ్ టాలీవుడ్‌లో ఏమాత్రం లేకపోయినా చెర్రీ రకుల్‌ను ప్రశంసించకపోవడంపై రకుల్ షాక్ గురైందట. అంతేగాకుండా బాగా అప్సెట్ అయ్యిందని సమాచారం. 
 
కాగా మెగా స్టార్ చిరంజీవి రకుల్ ప్రీత్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ రకుల్ చాలా బ్యూటిఫుల్ హీరోయిన్, సెన్సువల్ బ్యూటీ, ఎట్రాక్టివ్ గర్ల్ అంటూ తెగ పొగిడేసి సంచలనాలు సృష్టిస్తే చరణ్ మాత్రం ఈ సినిమాలో తనతో అక్క పాత్ర పోషించడానికి అంగీకరించిన కృతి కరబందను కొనియాడటం ఏంటని రకుల్ సన్నిహితులతో వాపోయిందట. 

Share this Story:

Follow Webdunia telugu