Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎవరూలేనిచోట ప్రియురాలితో... ఏం జరిగింది?

స.సి. కెమెరాలో కనిపించకుండా ఏకాంతంగా, ఎవరూ లేని చోట మనసువిప్పి మాట్లాడుకోవాలని వెళ్లిన ఒక జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రియురాలి శరీరంలో ఆకస్మికంగా వచ్చిన మార్పు ప్రియుడికి ఆందోళన కలిగించాయి. ఈ మార్పుకు కారణమేమిటీ, ప్రియురాలిలో మరో ఆత్మ ఎలా ప్రవే

ఎవరూలేనిచోట ప్రియురాలితో... ఏం జరిగింది?
, శనివారం, 28 జనవరి 2017 (18:04 IST)
స.సి. కెమెరాలో కనిపించకుండా ఏకాంతంగా, ఎవరూ లేని చోట మనసువిప్పి మాట్లాడుకోవాలని వెళ్లిన ఒక జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రియురాలి శరీరంలో ఆకస్మికంగా వచ్చిన మార్పు ప్రియుడికి ఆందోళన కలిగించాయి. ఈ మార్పుకు కారణమేమిటీ, ప్రియురాలిలో మరో ఆత్మ ఎలా ప్రవేశించింది వంటి ఆసక్తికరమైన అంశంతో 'సి.సి.కెమెరా' (బి ఎలర్ట్‌) సినిమా రూపొందుతోంది. సాయిరమేష్‌, ముంబాయికి చెందిన దీపాళి ధర్మ జంటగా నటిస్తున్నారు. 
 
నయన ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిస్తోంది. ''హత్యకు గురైన ఒక అమ్మాయి ఆత్మగా మారుతుంది. ఆమె హత్యకు కారణం ఏమిటీ? ఎవరు చేశారు? చివరికి జరిగిందేమిటీ అనే అంశాలతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోందని'' దర్శకుడు చెప్పారు. ''మరో విశేషమేమంటే కథ ప్రకారం జరిగే ప్రతి సంఘటన రహస్యంగా ఏర్పాటు చేసిన సి.సి. కెమెరాలో రికార్డ్‌ అవుతుంది. అందుకే సినిమాకు 'సి.సి. కెమెరా' బి ఎలర్ట్‌ అని టైటిల్‌ పెట్టడం జరిగింది. ఇది రెగ్యులర్‌ థ్రిల్లర్‌, హారర్‌ సినిమాలకు భిన్నంగా తీస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది'' అని అన్నారు.
 
''ఇప్పటికే ఒక షెడ్యూల్‌ జరిగిందని, మరో మూడు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తవుతుందని'' నిర్మాత సాయి రమేష్‌ కృష్ణకాంతి చెప్పారు. ''ఇందులో నాలుగు పాటలుంటాయి. ఇది హారర్‌, థ్రిల్లర్‌ సినిమా అయినప్పటికీ వినోదానికి కొదవ ఉండదు. కామెడీ మిళితమైన కథనంతో సాగే సస్పెన్స్‌ చిత్రమిది'' అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ట్రిపుల్ రోల్‌లో తారక్.. ఫిబ్రవరి 10న ముహూర్తమ్..