ఠాణాకు చేరిన టీవీ పంచాయతీలు... జీవితా రాజశేఖర్ కార్యదర్శులపై కేసు
హైదరాబాద్: నువ్వు మా స్టూడియోకు వస్తావా? రావా? పంచాయతీ చేయాలి... అంటూ ఓ ఆటో డ్రైవర్‌ని వేధిస్తున్నారని జీవిత రాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శులపై కేసులు నమోదయ్యాయి. చిలకలగూడ పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదయింది. బతుకు జట్కా బండి.
హైదరాబాద్: నువ్వు మా స్టూడియోకు వస్తావా? రావా? పంచాయతీ చేయాలి... అంటూ ఓ ఆటో డ్రైవర్‌ని వేధిస్తున్నారని జీవిత రాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శులపై కేసులు నమోదయ్యాయి. చిలకలగూడ పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదయింది. బతుకు జట్కా బండి... అనే టీవీ పంచాయతీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు... జీవిత రాజశేఖర్.
ఇటీవల హైదరాబాదులోని పార్శీగుట్టకు చెందిన ఒక ఆటో డ్రైవర్ పి. కొండను బతుకు జట్కాబండి పంచాయతీకి రావాలని వీరిద్దరు బెదిరించారు. కొండ తన భార్య జ్యోతితో గొడవపడి, పెద్దల సమక్షంలో విడిపోయారు. దీనికోసం జ్యోతికి కొండ లక్ష రూపాయలు ఇచ్చాడు. పెద్దల సమక్షంలో సంతకాలు చేసుకుని వీరిద్దరు విడిపోయారు.
ఇపుడు జ్యోతి బతుకు జట్కా బండి నిర్వాహకురాలు జీవిత రాజశేఖర్‌ని కలిసింది. దీనితో ఆమె కార్యదర్శులు కొండను బతుకు జట్కా బండి పంచాయతీకి రావాలని బలవంతం చేస్తున్నారు. దీనిపై కొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. మరి దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.