Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రహ్మోత్సవం షూటింగ్ ప్రారంభం: సెట్స్‌లో మహేష్, ప్రణీత, చాందిని

బ్రహ్మోత్సవం షూటింగ్ ప్రారంభం: సెట్స్‌లో మహేష్, ప్రణీత, చాందిని
, సోమవారం, 5 అక్టోబరు 2015 (10:59 IST)
శ్రీమంతుడు హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా బ్రహ్మోత్సవం. ముగ్గురు భామలతో ముచ్చటగా తెరకెక్కనున్న ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును మించిన కలరింగుతో ఈ సినిమాని తెరకెక్కుతోంది. బ్రహ్మోత్సవం  చిత్రంలో కీలకమైన ఫ్యామిలీ అట్మాస్పియర్‌లో పోష్ సంగీత్ సాంగ్ ఒకటి అప్పట్లో తెరకెక్కించారు. ఇక ఇప్పుడు రామోజీ ఫిలింసిటీలో సిసలైన బ్రహ్మోత్సవం మళ్లీ మొదలవుతోంది. 
 
ఓ భారీ ఇల్లు సెట్ వేసి అందులో కీరోల్స్‌తో సీన్స్ షూట్ చేస్తున్నారు శ్రీకాంత్ అడ్డాల.  ఈ నెల 18వ తేదీ వరకు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మహేష్‌తో పాటు ఇప్పటికే బెంగుళూర్ గర్ల్ ప్రణీత.. మరో తెలుగు లేడీ చాందిని చౌదరి షూటింగ్ సెట్‌లో జాయిన్ అయిపోయారు. ఇక స్టారీ లేడీలు సమంత - కాజల్ మాత్రం రావల్సి ఉంది. మొత్తానికి వచ్చే సంవత్సరంలో ఈ సినిమాను తెరపై చూడొచ్చునని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 

Share this Story:

Follow Webdunia telugu