Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ సెంటిమెంట్: సర్దార్ గబ్బర్ సింగ్‌లో అంత్యాక్షరి ఎపిసోడ్!

పవన్ సెంటిమెంట్: సర్దార్ గబ్బర్ సింగ్‌లో అంత్యాక్షరి ఎపిసోడ్!
, బుధవారం, 7 అక్టోబరు 2015 (16:07 IST)
పవన్ కల్యాణ్ సెంటిమెంట్‌ను బాగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది చిత్రం తర్వాత వెండితెరపై కనిపించనే లేదు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కామెడీకి మంచి ప్రాధాన్యత ఇచ్చారు.
 
ముఖ్యంగా గబ్బర్ సింగ్‌లో అంత్యాక్షరి ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. కొంతకాలం వరకు టీవీ షోలో కూడా ఈ ఎపిసోడ్ దుమ్మురేపింది. అప్పటి వరకు విలన్ వేషాలతో ఎవరూ గుర్తించని గబ్బర్ సింగ్ గ్యాంగ్ మంచి వెలుగులోకి వచ్చారు. 
 
'గబ్బర్’ బ్యాచ్‌గా… 'గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్‌’కు పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. వీరికి అవకాశాలు సైతం వెల్లువల్లా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే, 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో కూడా ఓ అంత్యాక్షరి ఎపిసోడ్‌ను ప్లాన్ చేయాలని దర్శకుడు బాబీకి చాలా కాలం క్రితమే పవన్‌ సూచించారట. దీంతో బాబీ కష్టాలు పడి అంత్యాక్షరి ఎపిసోడ్‌ను కొత్తగా డిజైన్ చేశాడని టాక్. ఈ ఎపిసోడ్ గబ్బర్ సింగ్‌కు మంచి పేరు సంపాదించిపెడుతుందని.. తద్వారా బంపర్ హిట్ అవుతుందని పవన్ ఆశిస్తున్నారట. 

Share this Story:

Follow Webdunia telugu