Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'బిట్ర‌గుంట' షూటింగ్ ప్రారంభోత్స‌వం

జాలీ ఫిలింస్ ప‌తాకంపై జె.వి.నాయుడు ప్ర‌ధాన పాత్ర‌లో నిర్మిస్తున్న రొమాంటిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్ 'బిట్ర‌గుంట'. 'ది బిగినింగ్' అనేది ఉప‌శీర్షిక‌. నాగ‌రాజు త‌లారి ద‌ర్శ‌కుడు. నాగ‌శివ‌, కిమ‌య నాయ‌కానాయిక‌లు

రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'బిట్ర‌గుంట' షూటింగ్ ప్రారంభోత్స‌వం
, సోమవారం, 8 ఆగస్టు 2016 (16:29 IST)
జాలీ ఫిలింస్ ప‌తాకంపై జె.వి.నాయుడు ప్ర‌ధాన పాత్ర‌లో నిర్మిస్తున్న రొమాంటిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్ 'బిట్ర‌గుంట'. 'ది బిగినింగ్' అనేది ఉప‌శీర్షిక‌. నాగ‌రాజు త‌లారి ద‌ర్శ‌కుడు. నాగ‌శివ‌, కిమ‌య నాయ‌కానాయిక‌లు. ఫిలింన‌గ‌ర్ (హైద‌రాబాద్) దైవ‌స‌న్నిధానంలో ఆర్‌.కె.గౌడ్ క్లాప్‌నివ్వ‌గా ఈ సినిమా ప్రారంభ‌మైంది. ప్రారంభోత్స‌వంలో ఆర్‌.కె.గౌడ్, సాయి వెంక‌ట్‌, 'స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్' రౌడీ గ్యాంగ్ స‌హా చిత్ర‌యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.
 
అనంత‌రం ముఖ్య అతిథి నిర్మాత ఆర్‌.కె.గౌడ్ మాట్లాడుతూ... 'కొత్త న‌టీన‌టుల‌తో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తున్నా. క‌థ‌, క‌థ‌నం బావున్నాయి. మంచి టెక్నిక‌ల్ టీమ్‌తో ప‌ని చేస్తున్నారు. టీమ్‌కి ఆల్ ది బెస్ట్' అన్నారు.
 
చిత్ర నిర్మాత నాయుడు మాట్లాడుతూ, 'టైటిల్ క్యాచీగా ఉందని ప్ర‌శంస‌లొచ్చాయి. హీరో నాగ‌శివ బిటెక్ గ్రాడ్యుయేట్‌. త‌న‌తో పాటు కొత్త కుర్రాళ్ల‌ను న‌టీన‌టులుగా ప‌రిచయం చేస్తున్నాం. 'స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్' విల‌న్ బ్యాచ్ న‌టిస్తున్నారు. సెప్టెంబ‌ర్ తొలి వారంలో చిత్రీక‌రణ ప్రారంభించి నెలాఖ‌రుకు ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం. నెల్లూరు, విజ‌య‌వాడ‌, గుంటూరు, ప్ర‌కాశం ప‌రిస‌రాల్లో చిత్రీక‌ర‌ణ చేస్తాం. నాగ‌రాజు క‌థ చెప్పిన తీరు ఆక‌ట్టుకుంది. చ‌క్క‌ని క్రైమ థ్రిల్ల‌ర్ ఇది. విచ్చేసిన అతిథుల‌కు ధ‌న్య‌వాదాలు' అని అన్నారు.  
 
ద‌ర్శ‌కుడు నాగ‌రాజు త‌లారి మాట్లాడుతూ, 'ప్రేమ‌లో ఏబీసీ' అనే చిత్రం చేశాను. ప్ర‌స్తుతం లంగా వోణి (తెలుగింటి బొమ్మ‌) అనే ద్విభాషా చిత్రం చేస్తున్నా. త‌దుప‌రి ప్ర‌య‌త్న‌మిది. దారి దోపిడీలు, మ‌ర్డ‌ర్లు, మాన‌భంగాలు చేసే రెండు గ్యాంగుల చుట్టూ తిరిగే క‌థ ఇది. ఆ గ్యాంగ్‌ల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య సాగే ఛేజింగ్‌ల మ‌ధ్య ఓ ల‌వ్‌స్టోరి ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠ‌గా సాగే చిత్ర‌మిది. నెల్లూరు జిల్లాలోని బిట్ర‌గుంట‌లో 1960- 80 మ‌ధ్య‌లో జ‌రిగిన కొన్ని నిజ‌ఘ‌ట‌న‌ల ఆధారంగా అల్లుకున్న సినిమా ఇది' అని వివరించారు.  
 
డి.విన‌య్‌, సాయి, అమ‌ర‌లింగేశ్వ‌ర‌రావు, కె.నాగ‌భూష‌ణం, ర‌వీంద్ర‌, బొర్రా సురేష్‌, మ‌హేష్ రెడ్డి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కున్ని.జి, మాట‌లు: బెజ‌వాడ ముర‌ళి కృష్ణ‌, కెమెరా: బైప‌ల్లి ర‌వికుమార్‌, క‌థ‌-క‌థ‌నం-ద‌ర్శ‌క‌త్వం: నాగ‌రాజు త‌లారి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడలో 'ఎల్ ‌7' టీమ్‌ హల్‌చల్‌ .. సేవా కార్యక్రమాల్లో నిమగ్నం