Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.20 కోట్ల క్లబ్‌లో చేరనున్న బిచ్చగాడు.. ఆరో వారానికి రూ.16 కోట్లు!

''పిచ్చైకారన్''ను తెలుగులో ''బిచ్చగాడు'' అనే పేరుతో మే 13న రిలీజైన సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోనీ, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆరంభంలో తడబడిన

రూ.20 కోట్ల క్లబ్‌లో చేరనున్న బిచ్చగాడు.. ఆరో వారానికి రూ.16 కోట్లు!
, గురువారం, 23 జూన్ 2016 (10:50 IST)
''పిచ్చైకారన్''ను తెలుగులో ''బిచ్చగాడు'' అనే పేరుతో మే 13న రిలీజైన సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోనీ, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆరంభంలో తడబడినా.. ప్రస్తుతం నిలకడగా భారీ విజయంతో పాటు కలెక్షన్లు కురిపిస్తున్న ఈ సినిమా విడుదలైన ఆరో వారంలో సైతం అన్ని ప్రాంతాల్లో సక్సెస్‌ఫుల్‌గా రనౌతుంది. 
 
ఇప్పటివరకు రూ. 16కోట్ల వరకు వసూళ్లను రాబట్టి ట్రెడ్ వర్గాలని సైతం ఆశ్చర్య పరిచింది. జూలై 1కి 50 రోజులు పూర్తి చేసుకోనున్న ''బిచ్చగాడు" ఆలోగా రూ. 20 కోట్ల క్లబ్‌లో చేరనుందని యూనిట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి బిచ్చగాడు సినిమా మరోసారి నిరూపించింది. విజయ్ ఆంటోనీ అద్భుతమైన నటన, దర్శకుడు శశి మేకింగ్ తీరుతో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఇంకా మదర్ సెంటిమెంట్ ద్వారా ప్రేక్షకులను ఈ సినిమా భారీ స్థాయిలో ఆకట్టుకుందని సినీ పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశ్వరూపం-2ను ఆస్కార్ రవిచంద్రన్ ఎందుకు రిలీజ్ చేయలేదో నాకు తెలియదు: కమల్