Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే.. అదే రోజున బాహుబలి 2 ట్రైలర్..

బాహుబలి ది బిగినింగ్‌తో భారతీయ సినిమా విలువలు అంతర్జాతీయ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాహుబలి ది బిగినింగ్‌కు సీక్వెల్ తెరకెక్కనుంది. ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చ

అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే.. అదే రోజున బాహుబలి 2 ట్రైలర్..
, మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (17:05 IST)
బాహుబలి ది బిగినింగ్‌తో భారతీయ సినిమా విలువలు అంతర్జాతీయ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాహుబలి ది బిగినింగ్‌కు సీక్వెల్ తెరకెక్కనుంది. ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న తెరకెక్కనున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసే విధంగా ప్రభాస్ బర్త్ డే రోజున (అక్టోబర్ 23) ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. 
 
ఇప్పటి దాకా ఈ సినిమాకు సంబంధించి ఓ ఫోటో కూడా రిలీజ్ కాని నేపథ్యంలో, ట్రైలర్ రిలీజ్ కోసం అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌ను ముందుగానే రిలీజ్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా బాహుబలి2కి క్రేజ్ లభిస్తుందని రాజమౌళి భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇంకా సినిమా రిలీజ్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన 'జెంటిల్‌మేన్' హీరోయిన్ నివేదా థామస్ హాట్ వీడియో