సినీ నటి అవికా గోర్ తల్లికాబోతున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. తన గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. తాను తల్లి కాబోతున్నానన్న ప్రచారం పూర్తిగా రూమర్స్ మాత్రమేనని చెప్పారు. అసత్యమైన విషయాలను ఎందుకు ఇంత వేగంగా షేర్ చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. చిన్న మాట లేదా పోస్ట్ చూసి అభిమానులు సైతం ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారని అన్నారు.
ఇలాంటి వార్తను తనను అసౌకర్యానికి గురిచేస్తున్నాయని కూడా తెలిపారు. అదేసమయంలో తన జీవితంలో ఒక పెద్ద శుభవార్త మాత్రం ఉందంటూ రహస్యంగా ఉంచారు. దీన్ని సరైన సమయంలో వెల్లడిస్తానని తెలిపారు. దీంతో నెటిజన్లు ఇది ఆమె కొత్త సినిమా లేదా కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్ అయి ఉండొచ్చని ఊహిస్తున్నారు.
కాగా, తెలుగు ప్రేక్షకులకు అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఉయ్యాలా జంపాలా' చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ... ఆ తర్వాత సినిమా 'చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజుగారి గది-3' వంటి చిత్రాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. టీవీ సీరియల్స్ నుంచి సినిమాల వరకు తన ప్రయాణాన్ని ఆమె విజయవంతంగా కొనసాగిస్తున్నారు.