Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రకుల్ శర్మతో అసిన్ లవ్వాయణానికి బ్రేకప్: ఎందుకో మరి..?

రకుల్ శర్మతో అసిన్ లవ్వాయణానికి బ్రేకప్: ఎందుకో మరి..?
, గురువారం, 2 జులై 2015 (12:35 IST)
సెలబ్రిటీల ప్రేమ బ్రేకప్ కావడం సాధారణమైన విషయం. సినీ తారలు ప్రేమలో పడటం ఆపై బ్రేకప్ కావడం ఎన్నోసార్లు చూస్తూనే వున్నాం. దక్షిణాది కంటే.. ఉత్తరాదిన ఎక్కువగా సినీ తారల ప్రేమలు చిగురించడం.. ఆపై కటీఫ్ కావడం ఎక్కువే.

ఈ క్రమంలో దక్షిణాది నుంచి ఉత్తరాది సినిమాల్లో నటిస్తూ అవకాశాలు లేకపోయినా, అక్కడే మకాం మార్చిన అసిన్ ప్రేమ బ్రేకప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
గతంలో కొన్నాళ్లు బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్‌తో స్నేహం చేసిన అసిన్, గత రెండేళ్ల నుంచి పారిశ్రామికవేత్త, మైక్రోమేక్స్ అధినేత రకుల్ శర్మతో ప్రేమాయణం సాగిస్తోంది.

ఇద్దరూ ఇక పెళ్లి కూడా చేసుకుంటారంటూ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా రకుల్ శర్మ-అసిన్‌ల మధ్య ప్రేమ కటీఫ్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ బ్రేకప్ కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. 

Share this Story:

Follow Webdunia telugu