Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాదాల పుట్ట ఆర్జీవీకి కేజ్రీవాల్‌ పీఎం కావాలట.. పీఎం ఏంటి..? అమెరికా ప్రెసిడెంటే?!

వివాదాల పుట్ట ఆర్జీవీకి కేజ్రీవాల్‌ పీఎం కావాలట.. పీఎం ఏంటి..? అమెరికా ప్రెసిడెంటే?!
, బుధవారం, 25 మే 2016 (17:31 IST)
వివాదాల పుట్ట రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పడ్డాడు. మొన్నటికి మొన్న హాట్ ఎమ్మెల్యే అంగూర్ లతాపై నిన్న సన్నీలియోన్‌పై కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఏకంగా ప్రధాని కావాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఎందుకంటే.. అరవింద్ కేజ్రీవాల్‌ని అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను వైట్‌హౌస్‌లో కలిసి చూడాలనుందని ట్వీట్ చేశాడు. 
 
మొన్నటికి మొన్న యంగ్ ఎమ్మెల్యే అంగూర్ లతా ఫోటోలతో ట్వీట్ చేసిన వర్మ.. ప్రస్తుతం కేజ్రీవాల్‌పై పడ్డాడు. బాలీవుడ్‌లో వీరప్పన్ సినిమా రిలీజ్ నేపథ్యంలో మంచి ఫామ్‌ను తిరిగి పొందవచ్చుననే ఉత్సాహంతో ఉన్న రామ్ గోపాల్ వర్మకు హిందీ వీరప్పన్ ఏమేరకు హిట్ ఇస్తాడో తెలియదు కానీ.. ట్విట్టర్ ద్వారా వర్మ ట్వీట్స్‌కు మంచి హిట్స్ వస్తున్నాయనే చెప్పాలి. 
 
ఇక అరవింద్ కేజ్రీవాల్‌పై ఆర్జీవీ చేసిన కామెంట్స్‌పై ఫాలోవర్స్ వెరైటీ ట్వీట్లు చేస్తున్నారు. ''నీలాంటోళ్లు సపోర్ట్ చేస్తే ఏకంగా పిఎం ఏంటీ... అరవింద్ కేజ్రీవాల్ అమెరికన్ ప్రెసిడెంట్ అవుతాడు''... అని రీ ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేన్స్ ఉత్సవంలో పర్పుల్ కలర్ లిప్ స్టిక్: ఐష్ అందుకే అలా చేసిందా?