Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లికి ఇంకా టైమ్ రాలేదులే.. వస్తే అదంతట అది జరిగిపోతుంది: అనుష్క

పెళ్లికి ఇంకా టైమ్ రాలేదులే.. వస్తే అదంతట అది జరిగిపోతుంది: అనుష్క
, బుధవారం, 26 ఆగస్టు 2015 (11:18 IST)
నా పెళ్లికి ఇంకా టైమ్ రాలేదని అందాల నటి అనుష్క అంటోంది. నాకు సరిపోయే వ్యక్తి ఇంకా దొరకలేదని అనుష్క వెల్లడించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర నాయకిగా ఓ వెలుగు వెలుగుతున్న అనుష్క బాహుబలి, రుద్రమదేవి సినిమాలతో సూపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం సైజ్ జీరో సినిమాలో నటిస్తోంది. అక్టోబర్ నుంచి బాహుబలి 2 షూటింగ్‌లో అనుష్క పాల్గొననుంది. ఈ నేపథ్యంలో అనుష్క పెళ్లి చేసుకోబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ విషయమై అనుష్క కదిలిస్తే మాత్రం పెళ్లికి ఇంకా టైమ్ రాలేదని అంటోంది. పెళ్లి భాజాలు మోగేందుకు టైమ్ అనేది వస్తేనే తప్పకుండా జరిగిపోతుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేరంటోంది. ఇంతకీ పెళ్లి చేసుకునేందుకు తగిన వ్యక్తి కనిపించలేదని అనుష్క చెప్తోంది. మరి అలాంటి వ్యక్తి అనుష్కకు ఎప్పుడు కనిపిస్తాడో..? ఇంకా ఎప్పుడు అనుష్క పెళ్లికూతురవుతుందో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu