Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నయనకు కాంప్లిమెంట్ ఇచ్చిన అనుష్క: ఇంతకీ ఏం చెప్పింది?

నయనకు కాంప్లిమెంట్ ఇచ్చిన అనుష్క: ఇంతకీ ఏం చెప్పింది?
, సోమవారం, 5 అక్టోబరు 2015 (11:35 IST)
స్టార్ హీరోయిన్ అయిన నయనతారకు అనుష్క కాంప్లిమెంట్ ఇచ్చింది. సాధారణంగా స్టార్ హీరోయిన్స్ తరపున ఈగో సమస్యలు ఉంటాయి. అలాంటిది ఫలానా పాత్ర మీరు కాకుండా ఇంకొకరు చేయాల్సి వస్తే ఎవరిని సజెస్ట్ చేస్తారు.. అని అడిగితే అనుష్క మాత్రం డిఫరెంట్‌గా సమాధానమిచ్చింది. రుద్రమదేవి- దేవసేన లాంటి పాత్రలకు మీరు కాకుండా ఎవరు సూటవుతారు అని అనుష్కను అడిగితే.. ‘‘ఇప్పటి హీరోయిన్లలో ఇలాంటి రాజసం ఉట్టిపడే పాత్రలకు నయనతార బాగా సూటవుతుంది’’ అని అనుష్క చెప్పుకొచ్చింది. 
 
రుద్రమదేవికి సీక్వెల్ తీయబోతున్నారా అని అనుష్కను అడిగితే.. తనకు ఆ విషయం తెలియదని చెప్పింది. గుణశేఖర్‌ మరోసారి రుద్రమదేవి ప్రయోగం చేస్తే తప్పకుండా నటిస్తానని తెలిపింది. మీడియాలో ప్రచారం జరిగినట్లు తనకు గుణశేఖర్‌కు ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని రుద్రమదేవి కోసం ఆయన తీవ్రంగా శ్రమించారన్నారు. రుద్రమదేవి కోసం ప్రాణం పెట్టి పని చేసిన ఆయన మీద తనకెంతో గౌరవం ఉందని అనుష్క చెప్పింది. 
 
సైజ్ జీరో సినిమాను ‘రుద్రమదేవి’కి పోటీగా తేవాలనుకున్న మాట అవాస్తవమని.. ‘రుద్రమదేవి’ రాకుంటే ఆ తేదీకి ‘సైజ్ జీరో’ను విడుదల చేయాలని మాత్రమే అనుకున్నామని.. కానీ రుద్రమదేవి అనుకున్నట్లే అక్టోబరు 9న విడుదలవుతుండటంతో సైజ్ జీరో వాయిదా వేశామని అనుష్క చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu