Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాసిపెట్టి ఉంటేనే పెళ్లనేది జరుగుతుంది.. అసిన్ కూడా అంతే: అనుష్క

రాసిపెట్టి ఉంటేనే పెళ్లనేది జరుగుతుంది.. అసిన్ కూడా అంతే: అనుష్క
, మంగళవారం, 6 అక్టోబరు 2015 (11:02 IST)
పెళ్లి గురించి మాటెత్తితేనే హీరోయిన్లు నోరెత్తడమే టైమ్ వేస్టంటూ మిన్నకుండిపోతారు. కొందరు ఏవేవో తమ అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. అయితే అనుష్క మాత్రం పెళ్లిపై మీడియా అడిగిన ప్రశ్నలకు చక్కగా యాన్సర్ చేసింది. ఈ రోజుల్లో అమ్మాయిలంతా సేమ్ గేమ్ ఆడుతున్నారు. డబ్బున్నవారినే పెళ్ళాడుతున్నారు. ఈ క్రమంలో అశిన్ మైక్రోమ్యాక్స్ ఓనర్ని పెళ్లి చేసుకుంటోంది. తెలివైన ప్లానింగ్ అది. అలా మీరు కూడా చేయట్లేదా? అని అడిగితే ముదురుగా సమాధానమిచ్చింది. 
 
అనుష్క ఏమంటోందంటే... ''పెళ్లి అనేది ప్లాన్ చేస్తే జరగదు. అది డెస్టినీ. రాసి పెట్టి ఉంటేనే జరుగుతుంది. అమ్మాయిలు పెళ్లిని బిజినెస్ చేశారు అంటే నమ్మను. అసిన్ ప్రేమాయణం చాలా వెరైటీగా జరిగింది. ముందుగా అక్షయ్ కుమార్ మైక్రోమ్యాక్స్ అధినేతని పరిచయం చేశారు. ఆ తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారి  ప్రేమ పెళ్లి వరకూ వెళుతోంది. నా జీవితంలో కూడా రైట్ పర్సన్ రావాలి. సరైన సమయం రావాలి. అప్పుడే పెళ్లి అనేది జరుగుతుంది. పెళ్లి ప్లాన్ చేస్తే జరిగేది కాదు. అమ్మాయి అన్నాక పెళ్లి చేసుకోవాల్సిందే'' అంటూ స్వీటీ తెలివైన సమాధానం చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu