Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుష్క శర్మ ఆ బ్రిడ్జ్‌కి తాళం వేసింది.. లవ్ లాక్‌లో కోహ్లీ పేరెక్కడ?

అనుష్క శర్మ ఆ బ్రిడ్జ్‌కి తాళం వేసింది.. లవ్ లాక్‌లో కోహ్లీ పేరెక్కడ?
, శనివారం, 3 అక్టోబరు 2015 (17:27 IST)
ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో లవ్ లాక్ వంతెన ఉంది. ఈ వంతెనకు ప్రియుడు, ప్రియురాలి పేరు రాసిన తాళం కప్పవేసి తాళం చెవిని ఆ నది నీటిలోకి విసిరేస్తారు. అలాగే లవ్ లాక్ వంతెనకు బాలీవుడ్ నటి అనుష్క శర్మ తాళం వేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ లవ్ లాక్ వేస్తూ కోహ్లీ పేరు కాకుండా డ్యూడ్ అని రాసింది. అనుష్క శర్మ తనపేరుతో పాటు డ్యూడ్ అని రాయడంతో కోహ్లీకి చుక్కలు కనిపించాయి. 
 
ఈ ఫోటోను అనుష్క శ్రమ ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేసింది. లవర్స్ బ్రిడ్జ్‌కు తాళం వేసి, కోహ్లీ పేరు కాకుండా డ్యూడ్ అని రాసింది. ఇంతకీ డ్యూడ్ ఎవరా? అని అంతా ఆరాతీయగా, ఆ పేరు అనుష్క శర్మ శునకానిదని తేలింది. ఆ శునకమంటే అనుష్కకి చాలా ఇష్టమట. దీంతో ఆ కుక్కపేరే లవ్ బ్రిడ్జ్‌పై వేసిన తాళానికి రాసినట్టు అనుష్క తెలిపింది. మరి కోహ్లీతో పాటు తన పేరును రాసిన లవ్ లాక్‌ను అనుష్క ఎప్పుడేస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu