Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్‌కళ్యాణ్‌తో రెడీ: పవర్ ఫుల్ స్టోరీతో సుసీంద్రన్ రెడీ!

పవన్‌కళ్యాణ్‌తో రెడీ: పవర్ ఫుల్ స్టోరీతో సుసీంద్రన్ రెడీ!
, గురువారం, 3 సెప్టెంబరు 2015 (18:43 IST)
పవన్‌కళ్యాణ్‌ గబ్బర్‌సింగ్‌లో ఐటం సాంగ్‌ వుంది. ఇప్పుడు సర్దార్‌... చిత్రంలోకూడా పెట్టాలని చూస్తున్నారు. ఇందుకు రంగం సిద్ధం చేశారు. కాగా, ఈ చిత్రం తర్వాత పవన్‌ ఎవరితో నటిస్తాడనేది ఆసక్తిగా మారింది. అందుకు ఈసారి తమిళ దర్శకుడు అయితే బాగుంటుందని అనుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరుణాకరన్‌, ఎస్‌.జె సూర్య, ధరణి లాంటి తమిళ డైరెక్టర్స్‌ ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌‌తో పనిచేసారు. 
 
తాజాగా సుసీంద్రన్‌ చేయాలని చూస్తున్నాడు. తను విశాల్‌ నటించిన జయసూర్యకు దర్శకత్వం వహించాడు. చిత్ర ప్రమోషన్స్‌‌లో పాల్గొన్న సుసీంద్రన్‌ పవన్‌ కళ్యాణ్‌ గురించిన ఆసక్తిక విషయాలను తెలిపాడు. 'నేను ఒక పవర్ఫుల్‌ స్క్రిప్ట్‌ రాశాను, నా ప్రకారం అది పవన్‌ కళ్యాణ్‌ గారికి పర్ఫెక్ట్‌‌గా సెట్‌ అవుతుంది. అతనితో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని' సుసీంద్రన్‌ తెలియజేశాడు. 
 
సుసీంధ్రన్‌ దర్శకత్వం వహించిన కార్తీ 'నా పేరు శివ', విశాల్‌ 'పల్నాడు', 'ఇంద్రుడు' సినిమాలు బాగానే ఆడాయి. అయితే వవన్‌తో సినిమా చేయాలని పలువురు దర్శకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎవరితో చేస్తాడో అనేది వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu