Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేం తప్పులు చేశామన్న నిర్మాత: మహేష్ బాబుతో అందరూ సపోర్ట్ చేశారన్న...?

మేం తప్పులు చేశామన్న నిర్మాత: మహేష్ బాబుతో అందరూ సపోర్ట్ చేశారన్న...?
, శుక్రవారం, 22 జనవరి 2016 (10:45 IST)
నిర్మాతగా సినిమారంగంలోకి వచ్చి దర్శకుడిగా కూడా అవతారమెత్తి.. అది ఫెయిలయ్యాక.. అసలేం జరుగుతుందో గ్రహించాడు.. ఆయనే నిర్మాత అనిల్‌ సుంకర. 'ఎ' అనే ఛానల్‌ పెట్టి. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులతో 14 రీల్స్‌ బ్యానర్‌ స్థాపించారు. ఆ బేనర్‌లో మొదట్లో సక్సెస్‌ చిత్రాలు తీసినా.. ఆ తర్వాత.. తనే దర్శకుడిగా.. 'యాక్షన్‌ 3డి' సినిమా తీసి ఫెయిల్యూర్‌ మూటగట్టుకున్నాడు. ఆ చిత్రం తొలి 3డి సినిమాగా తెలిపారు. 
 
అయితే ఆ తర్వాత... మహేష్‌బాబుతో '1' నేనొక్కడినే తీసి పెద్ద దెబ్బతిన్నారు. అలాంటి టైంలో వారికి పలువురు ఇండస్ట్రీనుంచి సపోర్ట్‌ చేశారు. అందులో మహేస్‌బాబుకూడా వున్నారు. అయితే తాము చేసింది.. తప్పా? ఒప్పా? అనేది మొదట్లో తెలియలేదు. చాలామంది చెబుతున్నారు. కానీ ఎందుకనే అలా జరిగిపోయింది.  ఏడాది క్రితం మేము చేసిన తప్పుల వలనో, వేరే కారణాల వలనో మా బేనర్‌ ఇబ్బందుల్లో పడింది. 
 
ఆ సమయంలో మేము బావుండాలని సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కోరుకున్నారు. అందులో నానికూడా వున్నారు. ఆయనతో సినిమా అనగానే పెద్దగా డిమాండ్‌ చేయలేదని.. మా ప్రొడక్షన్‌ వాల్యూస్‌ స్నేహితులు రామ్‌, గోపినే చూసుకున్నారు. మేము ముగ్గురం కలిసి విని ఓకే చేస్తేనే సినిమాలు చేస్తామని ఆయన ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu