Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజుగారి గది: ఓంకార్ మళ్లీ హారర్ మూవీ తీస్తాడా? ఫ్యామిలీ సినిమా తీస్తాడా?

రాజుగారి గది: ఓంకార్ మళ్లీ హారర్ మూవీ తీస్తాడా? ఫ్యామిలీ సినిమా తీస్తాడా?
, శనివారం, 9 జనవరి 2016 (17:53 IST)
టాలీవుడ్‌లో ప్రస్తుతం హారర్ ట్రెండ్ నడుస్తోంది. టీవీ యాంకర్ నుండి దర్శకుడిగా మారిన ఓంకార్‌పై కూడా హారర్ మూవీ ప్రభావం పడింది. ఆయన్ని హారర్ సినిమాలే తీయాల్సిందిగా ప్రేక్షకులు కోరుతున్నట్లు సమాచారం. మొదటి సినిమా జీనియస్ దెబ్బకొట్టినా.. రెండో మూవీ రాజు గారి గదితో తన ఖాతాలో హిట్ వేసుకున్న ఓంకార్‌కు ప్రస్తుతం ఆఫర్లు మస్తుగా వస్తున్నాయి. 
 
అయితే ఇప్పటికే రాజు గారి గది సీక్వెల్ కి స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఓంకార్..  వెంటనే దెయ్యాల జోనర్ లోనే మూవీ ఎందుకనే ఉద్దేశ్యంతో ఆగుతున్నాడు.
 
ఓంకార్‌ని ఫ్యామిలీ సబ్జెక్ట్ తీయమని స్నేహితులు చెబుతుంటే.. మూడో సినిమా కూడా సక్సెస్ అవ్వాలంటే దెయ్యాలనే నమ్ముకో అంటూ ఇండస్ట్రీలో కొందరు, ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారని తెలిసింది. దీంతో రెండు కాన్సెప్టులపై సబ్జెక్టులూ రెడీ చేసుకున్నాడు. ఏది తీయాలో మాత్రం డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు. మరి ఓంకార్ ఫ్యామిలీ మూవీ తీస్తాడో లేకుంటే హారర్ మూవీ తీస్తాడో తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu