Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ జపం చేసిన అనసూయ బర్త్ డే రోజున విషెస్.. పీకే ఫ్యాన్స్ హ్యాపీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అనసూయ బర్త్ డే విషెస్ చెప్పింది. అనసూయ జబర్దస్త్ షోతో ఎంత పాపులర్ అయ్యిందో కరెక్ట్‌గా తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్‌తో అత్తారింటికి దారేది చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చిందని..

పవన్ జపం చేసిన అనసూయ బర్త్ డే రోజున విషెస్.. పీకే ఫ్యాన్స్ హ్యాపీ
, శనివారం, 3 సెప్టెంబరు 2016 (15:59 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అనసూయ బర్త్ డే విషెస్ చెప్పింది. అనసూయ జబర్దస్త్ షోతో ఎంత పాపులర్ అయ్యిందో కరెక్ట్‌గా తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్‌తో అత్తారింటికి దారేది చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చిందని.. అయినా ఆ ఛాన్స్ వదులుకున్నానని చెప్పి పాపులర్ అయ్యింది.
 
ఆ సమయంలో పవన్ ఫ్యాన్స్ అనసూయను ఓ రేంజ్‌లో పీకే ఫ్యాన్స్ ఆటాడుకున్నారు. ఆపై ఆ గొడవ సద్దుమణగడం, ఆ తర్వాత సినీ ఛాన్సులతో బిజీ అయిపోవడం జరిగిపోయింది. తాజాగా అనసూయ పవన్ జపం చేసింది. తాజాగా సెప్టెంబర్ 2న పవన్ అభిమానులకు షాక్ ఇచ్చింది.
 
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. "ఈ కాలానికి చెందిని చాలా ప్రభావితం చేసే వ్యక్తి.. పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు. మోర్ పవర్ టూ యు పవర్ స్టార్'' అంటూ అమ్మడు తన సోషల్ నెట్ వర్క్ పేజీలో పోస్ట్ పెట్టి అభిమానుల అభిమానం పొందింది. అనసూయ కూడా పవన్‌కు ఫేవర్ కావడంతో పీకే ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జనతా గ్యారేజ్.. గుంటూరులో రూ.2.28 కోట్ల షేర్