Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అడవి శేషు-ఆదాశర్మ ''క్షణం''లో అనసూయ..!

అడవి శేషు-ఆదాశర్మ ''క్షణం''లో అనసూయ..!
, మంగళవారం, 24 నవంబరు 2015 (11:48 IST)
అడవి శేషు-ఆదాశర్మ జంటగా నటిస్తున్న సినిమాలో క్షణం అనే సినిమా అనసూయ నటించనుంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమా రిలీజ్ కాకముందే అనసూయ మరో ఛాన్సును కైవసం చేసుకుంది. అడివి శేషు - ఆదాశర్మ కాంబినేషన్లో 'క్షణం' అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అనసూయ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ సినిమా ద్వారా దర్శకుడిగా రవికాంత్ పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉండటంతో, అది అనసూయ చేస్తే బాగుంటుందని ఈ సినిమా యూనిట్ భావించిందట. కథతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో, ఈ సినిమా చేయడానికి అనసూయ ఓకే చెప్పేసిందని అంటున్నారు. సోగ్గాడే రిలీజ్‌కు ముందే మరో సినిమాకు అనసూయ సంతకం చేసేయడంతో.. సోగ్గాడే రిలీజ్ అయితే అనసూయ కాల్షీట్ దొరుకుతుందో లేదోనని అందరూ అనుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu