Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Naveen : అనగనగా ఒక రాజ సంక్రాంతి పండుగలా ఉంటుంది: నవీన్‌ పొలిశెట్టి

Advertiesment
Naveen Polishetty, Suryadevara Naga Vamsi, Mari, Meenakshi Chaudhary,  Revanth

దేవీ

, మంగళవారం, 13 జనవరి 2026 (16:56 IST)
Naveen Polishetty, Suryadevara Naga Vamsi, Mari, Meenakshi Chaudhary, Revanth
ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న అసలు సిసలైన పండుగ సినిమా 'అనగనగా ఒక రాజు'. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

మొదటి నుంచి ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి 2026, జనవరి 14న థియేటర్లలోకి వస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. భారీ అంచనాల నడుమ 'అనగనగా ఒక రాజు' థియేటర్లలో అడుగుపెడుతున్న నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
 
ఈ సందర్భంగా స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. "అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెలుగువారికి సంక్రాంతి అనేది ప్రత్యేకమైన పండుగ. ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోయి మన వాళ్ళను కలుసుకొని సంతోషంగా ఉంటాం. ఒత్తిడిని పక్కన పెట్టి, పిండి వంటలు తింటూ, నలుగురితో నవ్వుకుంటూ చాలా సరదాగా ఉంటాం. అలాంటి ఎనర్జీనే 'అనగనగా ఒక రాజు'లో చూడబోతున్నారు. మన ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించేలా సినిమా ఉంటుంది. ట్రైలర్ కి మీ నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన.. సినిమాపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ట్రైలర్ లో ఉన్న జోక్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఒక పర్ఫెక్ట్ పండగ సినిమాలా ఉంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంది, చాలా చాలా బాగుంది అంటూ అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే బుకింగ్స్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ తోనే నా గత చిత్రాల ఓపెనింగ్స్ ని దాటేసింది. మీరు ఈ సినిమాపై చూపుతున్న ఆసక్తికి తగ్గట్టుగానే.. మిమ్మల్ని అలరించేలా ఈ సినిమా ఉంటుంది." అన్నారు.
 
కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "మేమందరం ఎంతో కష్టపడి పని చేసి.. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాము. ఈ సినిమాపై మీ స్పందన కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. మీరు ఈ సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. మీ కుటుంబంతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. హాయిగా నవ్వుకుంటూ.. ఈ సంక్రాంతి పండుగను జరుపుకోండి." అన్నారు.
 
చిత్ర దర్శకుడు మారి మాట్లాడుతూ.. "సినిమా చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్టైనర్ ఇది. సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన పండుగ. సంక్రాంతి అనేది తెలుగువారికి ఒక ఎమోషన్. సంక్రాంతి కానుకగా మా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. ఈ పండగకు మీ కుటుంబంతో కలిసి చూసి హాయిగా నవ్వుకునే క్లీన్ ఎంటర్టైనర్ ఇది. జనవరి 14న కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్ళి.. మీ బాధలన్నీ మర్చిపోయి రెండున్నర గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోండి. రాజు గారితో ఈ పండగను ఎంజాయ్ చేయండి." అన్నారు.
 
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "గోదావరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన కథతో ఈ సినిమా రూపొందింది. నవీన్ శైలిలో చాలా సరదాగా సినిమా ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్ కూడా ఇందులో ఉంటుంది. సినిమా ఎంత నవ్విస్తుందో.. అదే సమయంలో చివరిలో ఒక మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. కామెడీ, ఎమోషన్, ఫైట్, పాటలు ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన పండగ సినిమా ఇది." అన్నారు.
 
బాల నటుడు రేవంత్ మాట్లాడుతూ.. "నాకు ఇంత మంచి అవకాశమిచ్చిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారికి, నవీన్ గారికి థాంక్స్. చాలా మంచి పాత్ర పోషించాను. ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లో కూడా ఉంటాను. సినిమా చూసి మీరందరూ చాలా చాలా నవ్వుకుంటారు. జనవరి 14న థియేటర్ కి వచ్చి సినిమా చూడండి." అన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస్సామీ చిత్రం జూయిఫూల్ ఉత్తమ చలనచిత్ర అవార్డు; దర్శకుడిగా రాజేష్ టచ్‌రివర్