Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమితాబ్ కోసం సన్నీ స్పెషల్ వీడియో.. పాక్ నటుల గురించి నోరెత్తనన్న బిగ్ బీ..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పట్ల పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన అభిమానాన్ని చాటుకుంది. ట్విట్టర్‌లో అమితాబ్‌కు భారీగా ఫాలోవర్స్ ఉంటారు. బిగ్ బీని అభిమానించే వారిలో శృంగార తార సన్నీలియోన్ కూడా

అమితాబ్ కోసం సన్నీ స్పెషల్ వీడియో.. పాక్ నటుల గురించి నోరెత్తనన్న బిగ్ బీ..
, మంగళవారం, 11 అక్టోబరు 2016 (16:07 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పట్ల పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన అభిమానాన్ని చాటుకుంది. ట్విట్టర్‌లో అమితాబ్‌కు భారీగా ఫాలోవర్స్ ఉంటారు. బిగ్ బీని అభిమానించే వారిలో శృంగార తార సన్నీలియోన్ కూడా ఉంది. అమితాబ్‌పై తన అభిమానాన్ని చాటుకోవడానికి, ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియోను రూపొందించింది. తన పెంపుడు కుక్కతో కలసి రూపొందించిన ఈ వీడియోలో వైట్ టాప్, షార్ట్ జీన్స్ వేసుకుని కనిపించింది సన్నీ. ఈ వీడియోలో అమితాబ్ కోసం ఓ పాట కూడా పాడింది. 
 
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 11న తన పుట్టిన రోజు సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. ఉరీ దాడుల అనంతరం దేశ మొత్తం సైన్యానికి సంఘీభావంగా నిలవాల్సిన సమయమిదని పసిగట్టిందని వ్యాఖ్యానించారు. తన పుట్టిన రోజు సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన పాకిస్థాన్ నటులు భారత చిత్రాలలో నటించడంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. దేశం మొత్తం సైన్యం పక్కన నిలబడాల్సిన అవసరాన్ని గుర్తించిన ఈ సమయంలో ఇటువంటి వివాదాల జోలికి వెళ్లడం తగదని పేర్కొన్నారు. అమితాబ్ పుట్టిన రోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కత్రినా కైఫ్ కిడ్నాప్ అయ్యిందట.. డ్రైవర్ చేతిలో బందీ అయ్యిందట.. నిజమేనా?