Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమలా పాల్‌ను వద్దనుకున్న ధనుష్.. లైఫూ పోయె.. సినిమా పోయె.. డిప్రెషన్‌లో...?

ఇద్దరమ్మాయిలతో ఫేమ్ అమలా పాల్‌కు కష్టాలపై కష్టాలొస్తున్నాయి. విజయ్‌తో ప్రేమ వివాహం కాస్త బెడసికొట్టడంతో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన అమలా పాల్‌ను ధనుష్ కూడా వద్దనుకున్నాడు. ధనుష్‌తో వడ చెన్నై సినిమ

అమలా పాల్‌ను వద్దనుకున్న ధనుష్.. లైఫూ పోయె.. సినిమా పోయె.. డిప్రెషన్‌లో...?
, శనివారం, 13 ఆగస్టు 2016 (14:19 IST)
ఇద్దరమ్మాయిలతో ఫేమ్ అమలా పాల్‌కు కష్టాలపై కష్టాలొస్తున్నాయి. విజయ్‌తో ప్రేమ వివాహం కాస్త బెడసికొట్టడంతో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన అమలా పాల్‌ను ధనుష్ కూడా వద్దనుకున్నాడు. ధనుష్‌తో వడ చెన్నై సినిమాలో నటించడం విజయ్‌కు నచ్చకపోవడంతోనే అమలా పాల్‌ను వదిలించుకునేందుకు విజయ్ సిద్ధమయ్యాడు. ఇక ధనుష్ కూడా ఆమెపై విడాకుల గురించి వార్తలు రావడంతో ఒక్కసారిగా తన సినిమాకు హీరోయిన్‌ను మార్చేయాలని డిసైడ్ అయ్యాడు. 
 
రజనీకాంత్ పెద్దకుమార్తె, ధనుష్ భార్య అయిన ఐశ్వర్య కారణమని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ధనుష్‌తో సినిమా చేయడం ద్వారానే అమలా పాల్ భర్తకు దూరమైందని వార్తలు రావడంతో ఆ హీరోయిన్‌ను పక్కనబెట్టేయాల్సిందిగా ఐశ్వర్య పట్టుబట్టింది. దీంతో భార్య మాటని జవదాటని ధనుష్ అమలా పాల్‌ను వడచెన్నై నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
 
అమలా పాల్ స్థానంలో మరో హీరోయిన్‌ను కూడా ఎంపిక చేసుకునే దిశగా ధనుష్ ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో అమలా పాల్‌కు లైఫూ పోయింది.. సినిమా ఛాన్సూ పోయింది.. చివరికి ఒత్తిడిలో తలపట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సినీ పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్‌లో ఇల్లి బ్యూటీకి ఛాన్సుల వెల్లువ.. బర్ఫీ హిట్‌తో.. ఆఫర్లో ఆఫర్లు!