Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బొమ్మరిల్లు', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'.. సినిమాలు చేస్తే బాగుండునే అనుకున్నాను : అల్లు అర్జున్

అల్లు శిరీష్‌ హీరోగా, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ప్రముఖ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో నిర్మించిన 'శ్రీరస్తు శుభమస్తు'. ఈనెల 5వ తేదీన ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

'బొమ్మరిల్లు', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'.. సినిమాలు చేస్తే బాగుండునే అనుకున్నాను : అల్లు అర్జున్
, మంగళవారం, 9 ఆగస్టు 2016 (19:29 IST)
అల్లు శిరీష్‌ హీరోగా, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ప్రముఖ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో నిర్మించిన 'శ్రీరస్తు శుభమస్తు'. ఈనెల 5వ తేదీన ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో సోమవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. 
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'తమ్ముడు శిరీష్‌ నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాన్ని హిట్‌ చేసిన ప్రేక్షక మహాశయులకు అభినందనలు. అయితే నేనిక్కడ ఒక మాటను చెప్పడానికి వచ్చాను. ఈ సినిమా పట్ల నేను మొదటి నుంచి చాలా పాజిటివ్‌ టాక్‌తో ఉన్నాను. పరశురాంను గమనిస్తూ వస్తున్నాను. యంగ్‌ డైరెక్టర్స్‌ తమ స్పీడ్‌ను కంట్రోల్‌ చేసుకుని కథలు రాస్తే అద్భుతమైన కథలు వస్తాయి. అది నేను పరశురాంలో చూశాను. ఏడాదిన్నరగా పరుశురాం, శిరీష్‌ల ట్రావెలింగ్‌ను గమనిస్తూ వస్తున్నాను. టైటిల్‌ వినగానే మంచి ప్లజంట్‌గా ఉందనుకున్నాను. టైటిల్‌ బాగుందంటూ కొందరు మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సినిమా రెఢీ అయిన తర్వాత రషెష్ చూశాను ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆ విషయాన్ని నాన్నగారితో కూడా చెప్పాను. 
 
సాధారణంగా 'బొమ్మరిల్లు', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' చిత్రాలు చూసి నేను కూడా అలాంటి సినిమాలు చేస్తే బాగుండునే అనుకున్నాను. కానీ శిరీష్‌ ప్రారంభంలోనే అలాంటి ఒక మంచి నటించే సక్సెస్‌ను అందుకున్నాడు. తను స్టార్టింగ్‌లో అలీ, రావు రమేష్ వంటి సీనియర్ నటీనటుల నుంచి మంచి సపోర్ట్‌ లభించింది. వారిద్దరితో శిరీష్‌ నటించడం వలన శిరీష్‌ నటనలో ఎంతో బెటర్‌మెంట్‌ను చూపాడు. ఎవరెంత కష్టపడినా సినిమా సక్సెస్‌కు డైరెక్టర్‌, డైరెక్టర్‌ టీమ్‌ కారణమవుతుంది. నాకు, మా నాన్నగారికి, శిరీష్‌కు ఈ సినిమా ఎంతో ప్రెస్టిజియస్. దీన్ని శిరీస్ డెబ్యూ మూవీలా భావించాం. తన కెరీర్‌కు రోడ్డులాంటి సినిమాగా అనుకున్నాం. అలాంటి బాధ్యతను చక్కగా నిర్వహించి మంచి విజయాన్ని అందించిన పరుశురాంకి నా స్పెషల్ థాంక్స్. తన కొడుకులకు మంచి సక్సెస్‌లు ఇస్తున్న నాన్నగారిని చూసి రేపు నా కొడుకు పట్ల ఎలా ఉండాలన్నది తెలుసుకున్నాను' అన్నారు. 
 
అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, 'ఇంతటి మంచి విజయాన్నిచ్చిన ప్రేక్షక మహాశయులకు, సపోర్ట్ చేసిన వారికి నా థ్యాంక్స్‌. మనం ఎంత కష్టపడితే ఎంత ఎత్తుకు ఎదుగుతామో చిరంజీవి గారిని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి వాళ్లు కూడా కష్టపడతారని తెలుసు. శిరీష్ ఎఫర్ట్ పెడుతున్నంత కాలం తనని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను' అన్నారు. 
 
హీరో అల్లు శిరీష్‌ మాట్లాడుతూ, 'సినిమా సక్సెస్ అవుతుందని తెలుసు కానీ డైలాగ్స్‌ చెప్పటం నుంచి ఎక్స్‌ప్రెషన్స్‌ వరకు ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమా నాకు 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రానికి ముందు శిరీష్‌, ఆ తర్వాత శిరీష్‌ అనేంత పేరు తెచ్చింది. నన్ను గురువులా చెక్కారు. ఈ సక్సెస్ నా తలకెక్కకుండా భవిష్యత్‌లో సినిమాలు చేస్తాను. ఎందరో ఆర్టిస్టులు గీత ఆర్ట్స్‌‌లో చేయాలనుకుంటారు. కొంత మందికి వీలవుతుంది, కొందరికి కాదు, కానీ నేను అరవింద్‌ కొడుకును కనుక గీతా ఆర్ట్స్‌ అనే పెద్ద బ్యానర్‌లో నేను చేయగలిగాను. ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేశాను. ఎన్నో హిట్‌ చిత్రాలనిచ్చిన మా బ్యానర్‌కి మా ఈ సినిమా బ్రేక్‌లా ఉండకూడదని కష్టపడి చేశాను. ఇంత పెద్ద సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్' అన్నారు. ఈ కార్యక్రమంలో అలీ, రావు రమేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజు తదితరులు పాల్గొని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను వర్జిన్‌ను కాదంటున్న తాప్సీ.. నిజమా?