మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాన్ని నేడు తిలకించిన నిర్మాత అల్లు అరవింద్ చాలా సంతోషంగా మీడియాతో పంచుకున్నారు. సినిమా చూశాక ఏంగ్ జైటీతో బయటకు వస్తున్నారు. బాస్ ఈజ్ కమ్ బ్యాక్. బాస్ ఈ ఈజ్ బాస్. ఘరానా మొగుడు రోజులు గుర్తుకు వచ్చాయి. చాలా ప్లజెంట్ గా కనిపించారు. సన్నివేశాలు చాలా అద్శుతంగా పటించారు. ఇక వెంకటేష్ కాంబినేషన్ చెప్పక్కర్లేదు. మరో రేంజ్ లో ఇద్దరి నటన వుంది. ఫ్యామిలీ సినిమాతో సంక్రాంతిని కుమ్మేశారంటూ కితాబిచ్చారు.
ఇదిలా వుండగా, నేడు మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో ఆత్మీయ కలయికగా దర్శకుడు అనిల్ రావిపూడి కలిశారు. అక్కడే వున్న వెంకటేష్ ను ఆలింగనం చేసుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కూడా అక్కడే వున్నారు.సాహు అయితే అనిల్ ను ఎత్తుకుని మరీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
చిరంజీవి స్పందిస్తూ.. కొట్టావయ్యా.. హిట్ కొట్టావ్.. అంటూ అనిల్ తో ప్రశసంలు కురిపించారు. ఇది నాది కాదు సార్. అంతా మీ సక్సెస్ అంటూ అభిమానంగా బదులిచ్చారు. వెంకటేష్ కూడా అనిల్ ను మెచ్చుకున్నారు. మళ్ళీ అవకాశం వుంటే మరో సినిమాతో కలుద్దామంటూ సరదాగా మాటలు సాగాయి. ఈ సందర్భంగా చిరంజీవి తేనీటి విందు ఏర్పాటు చేశారు.