Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అఖిల్‌ను ఫోకస్ చేసిన రామ్ గోపాల్ వర్మ: స్టార్లంతా వంట చేసుకోవాల్సిందేనట!

అఖిల్‌ను ఫోకస్ చేసిన రామ్ గోపాల్ వర్మ: స్టార్లంతా వంట చేసుకోవాల్సిందేనట!
, శుక్రవారం, 28 ఆగస్టు 2015 (16:55 IST)
అక్కినేని యంగ్ స్టార్ అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. 'AKHIL' అనే పేరుతో 'Power of JUA' అనే ట్యాగ్ లైన్‌తో గురువారం అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అఖిల్ లుక్ మాస్‌ను ఆకట్టుకునే రీతిలో ఉందని సోషల్ వెబ్ సైట్లలో కామెంట్స్ వస్తున్నాయి. ఇక వివాదాస్పద రామ్ గోపాల్ వర్మ కూడా అఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై ఫోకస్ పెట్టాడు. 
 
అంతేగాకుండా...సెన్సేషనల్ ట్వీట్స్ చేశాడు. అఖిల్ లుక్ చూస్తే.. మెగా, సూపర్, పవర్, రెబల్, క్రేజీ స్టార్లు ఇక యాక్టింగ్ వదిలేసి వ్యవసాయమో, వంటో చేసుకోవాల్సిందేనని ట్వీట్ చేశారు. మరోవైపు బాహుబలి మేకర్ కూడా అఖిల్ సినిమా ఫస్ట్ లుక్‌‍‌పై అదుర్స్ అంటూ కామెంట్ చేశాడు. ఇక నాగార్జున పుట్టిన రోజునాడైన ఆగస్టు 29న అఖిల్ తొలి మూవీ టీజర్ రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్‌కే భారీ స్పందన వచ్చిన నేపథ్యంలో.. ఇక ట్రైలర్‌ రిలీజైతే ఎంత రెస్పాన్స్ ఉంటుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu