Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

Advertiesment
akhanda-2

ఠాగూర్

, మంగళవారం, 2 డిశెంబరు 2025 (19:23 IST)
అగ్ర నటుడు బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం "అఖండ2: తాండవం". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబరు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'అఖండ2' టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
 
సింగిల్‌ స్క్రీన్‌లో రూ.75, మల్టీ ప్లెక్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) ధర పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. డిసెంబరు 4న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్‌కు కూడా అనుమతి లభించింది. ఈ టికెట్‌ ధరను రూ.600గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు.  రోజుకు ఐదు షోలతో పాటు, పెంచిన ధరలు విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి