Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

Advertiesment
Vivek Mishra, Sruthika
Vivek Mishra, Sruthika
వివేక్ మిశ్రా, శృతిక జంటగా నటిస్తున్న సినిమా అహోం. ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్ బ్యానర్ పై దశరథ్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమా తెరకెక్కనుంది. నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
 
నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ, ఈ రోజు సినిమా ఒక్క భాషలో చేస్తే వర్కవుట్ కావడం లేదు. హిందీతో పాటు దక్షిణాది అన్ని ప్రధాన భాషల్లో "అహోం" సినిమాను రూపొందిస్తున్నారు. బెంగాళీ, మరాఠీ వంటి భాషలతో పాటు ఈ చిత్రానికి ఇంగ్లీష్ లోనూ డబ్ చేయాలని సూచిస్తున్నా. నిర్మాత దశరథ్ గారికి కంగ్రాట్స్. కొత్త నిర్మాతలు బాగుంటేనే మరిన్ని చిత్రాలు తెరకెక్కి ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్న వారికి ఉపాధి కల్పిస్తాయి. "అహోం" సినిమా మంచి విజయం సాధించాలని కోరుతున్నా. అన్నారు.
 
హీరో వివేక్ మిశ్రా మాట్లాడుతూ -హైదరాబాద్ అంటే మూవీస్, మ్యూజిక్ కన్సర్ట్స్ లకు ఫేమస్. మా మూవీలో నటించేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు హిందీ సినిమా, తెలుగు సినిమా అని పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు మన సినిమా వరల్డ్ సినిమా అయ్యింది. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. అన్నారు.
 
 నటుడు విశ్వ మాట్లాడుతూ - ప్రసాద్ రాజు గారు దర్శకత్వం అవకాశం కోస చాలాకాలంగా వేచి చూస్తున్నారు. ఆయనకు ఈ సినిమాతో మంచి అవకాశం దక్కింది. ఈ సినిమా పేరులోనే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. నాకు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసే అవకాశం కలిగింది. అన్నారు.
 
నటుడు కోటకొండ కృష్ణ మాట్లాడుతూ - నాకు నటుడిగా మొదటి అవకాశం కల్పించింది ప్రసాద్ రాజు గారే. ఆయన మహానంది సినిమాలో నాకు నటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 25 చిత్రాల్లో నటించాను. ప్రసాద్ రాజు గారు తెరకెక్కిస్తున్న "అహోం" నా 26వ సినిమా కావడం సంతోషంగా ఉంది. అన్నారు.
 
నటుడు శాండీ మాట్లాడుతూ - ఈ మూవీలో వర్క్ చేసే అవకాశం రావడం ఎగ్జైటింగ్ గా ఉంది. మా హీరో హీరోయిన్స్ తో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి, మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
డైరెక్టర్ ప్రసాద్ రాజు గారు మాట్లాడుతూ, ప్రతి ఫిలింమేకర్ తమ సినిమా బాగుండాలనే రూపొందిస్తాడు. నేనూ అలాగే ఒక మంచి సినిమా చేయాలని ఈ మూవీ మొదలుపెట్టాను. మా మూవీకి ఎలాంటి విజయం అందించాలి అనేది ప్రేక్షక దేవుళ్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం. అన్నారు.
 
ప్రొడ్యూసర్ దశరథ్ మాట్లాడుతూ - "అహోం" సినిమాను మా ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాం. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సరికొత్త కథా కథనాలతో మా దర్శకుడు ప్రసాద్ రాజు సినిమాను రూపొందిస్తున్నారు. మీ అందరి సపోర్ట్ మా మూవీకి ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు - వివేక్ మిశ్రా, శృతిక, అజయ్ ఘోష్, శాండీ, కోటకొండ కృష్ణ, తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం