Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కసరత్తు చేస్తున్న ఆదాశర్మ, జిమ్నాస్టిక్స్ ఎక్స్‌పర్ట్

నటి ఆదాశర్మ బాలీవుడ్‌లో 'కమేండో2'లో నటిస్తోంది. స్వతహాగా జిమ్నాస్టిక్‌లో అనుభవమున్న తను ఈ చిత్రం కోసం భారీ కసరత్తే చేస్తోంది. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొన్ని పోరాటాలు చేయాల్సి వుంటుంది. దానికి సంబంధించిన శిక్షణ ముంబైలో తీసుకుంటుంది. ఆ ఫొటోల

కసరత్తు చేస్తున్న ఆదాశర్మ, జిమ్నాస్టిక్స్ ఎక్స్‌పర్ట్
, బుధవారం, 25 మే 2016 (20:09 IST)
నటి ఆదాశర్మ బాలీవుడ్‌లో 'కమేండో2'లో నటిస్తోంది. స్వతహాగా జిమ్నాస్టిక్‌లో అనుభవమున్న తను ఈ చిత్రం కోసం భారీ కసరత్తే చేస్తోంది. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొన్ని పోరాటాలు చేయాల్సి వుంటుంది. దానికి సంబంధించిన శిక్షణ ముంబైలో తీసుకుంటుంది. ఆ ఫొటోలను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. 
 
తొలిసారిగా '1920' అనే హర్రర్‌ మూవీలో నటిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత తెలుగులో 'హార్ట్‌ ఎటాక్‌', 'క్షణం' 'సన్నాఫ్‌ కృష్ణమూర్తి' చిత్రాల్లో నటించింది. ఇక కమెండో2లో విద్యుత్‌ జమ్‌వాలా కథానాయకుడు. యాక్షన్‌ హీరోగా పేరుపొందిన ఆయనతో నటించాలంటే ఈ మాత్రం కసరత్తులు అవసరమని తెలియజేస్తుంది. గతంలో జిమ్నాస్టిక్‌పై పలు ప్రోగ్రామ్‌లు కూడా చేసిన ఆదాశర్మకు అవే నటిగా ఎదిగేందుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గతిలేని స్థితిలో చిన్న సినిమా: దాసరి నారాయణరావు