Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా అందాన్నే పొగుడుతున్నారు.. కానీ..

నా అందాన్నే పొగుడుతున్నారు.. కానీ..
, శనివారం, 13 ఫిబ్రవరి 2016 (20:57 IST)
అందరూ తన అందం గురించి మాట్లాడుతున్నారు. చాలా అందంగా వుంటుంది... హీరోయిన్‌ అవ్వాల్సింది.. క్యారెక్టర్లు చేస్తుందంటూ చెబుతున్నారు కానీ ఒక్కరు కూడా... పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పడం లేదని... నటి ప్రగతి అంటోంది. హీరోయిన్‌ కావాలని అనుకున్నా ఆమెకు వచ్చిన పాత్రలను బట్టి తల్లి పాత్రలే అన్ని సినిమాల్లో వేసింది. 
 
బృందావనంతో ఎన్‌టిఆర్‌ తల్లిగా.. ఇలా ప్రముఖ హీరోలకు తల్లిగా చేసిన ఆమె గురించి సీనియర్‌ దర్శకుడు రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ.. మన ఇండస్ట్రీలో వింత వాతావరణ వుంది. ఎవరైనా పోలీసు, లాయర్‌, ప్లీడర్‌, డాక్టర్‌.. ఇలా ఏ సినిమాలోనైనా వేస్తే ఇక అవే వస్తుంటాయి. అలాగ ప్రగతి కూడా మంచి అందగత్తైనా తల్లి పాత్రలకే పరిమితం అయిందని బాధపడ్డారు. ఆయన నిర్మాతగా చేసిన 'మలుపు'లో హీరో ఆదికి తల్లిగా నటించింది. ఈ నెల 19న విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu