Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆటో డ్రైవర్‌ సెల్ఫీ కోసం వెంటపడిన నటి నమిత... ఎందుకో తెలుసా?

సాధారణంగా సెలెబ్రిటీల కోసం, సినీ నటీనటులతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడుతుంటారు. ఇందుకోసం వారి కార్ల వెంట పరుగులు తీస్తుంటారు. కానీ, ఆ నటి మాత్రం.. ఓ మహిళా ఆటో డ్రైవర్‌తో సెల్ఫీ దిగేందుకు న

ఆటో డ్రైవర్‌ సెల్ఫీ కోసం వెంటపడిన నటి నమిత... ఎందుకో తెలుసా?
, శనివారం, 1 అక్టోబరు 2016 (15:11 IST)
సాధారణంగా సెలెబ్రిటీల కోసం, సినీ నటీనటులతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడుతుంటారు. ఇందుకోసం వారి కార్ల వెంట పరుగులు తీస్తుంటారు. కానీ, ఆ నటి మాత్రం.. ఓ మహిళా ఆటో డ్రైవర్‌తో సెల్ఫీ దిగేందుకు నానా తంటాలు పడింది. చివరకు ఆమె నడుపుతున్న ఆటోను వెంబడించి తన కోర్కెను తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఎవరా నటి అనే కదా మీ సందేహం. ఆమె ఎవరో కాదు. బొద్దుగుమ్మ నమిత. 
 
ఇటీవల నమిత చెన్నైలోని మాణిక్యం రోడ్డులో కారులో వెళుతోంది. అదేసమయంలో అటుగా ఓ ఆటో వెళ్తోంది. ఆ ఆటో నడుపుతున్న వ్యక్తిని చూసి నమిత తెగ ఆనందపడిపోయింది. వెంటనే తన కారుతో ఆ ఆటోను ఫాలో చేసి ఆ డ్రైవర్‌ దగ్గరకు పరిగెత్తి సెల్ఫీ తీసుకుంది. కారణం.. ఆ ఆటోను నడుపుతోంది ఓ పేద కుటుంబానికి చెందిన మధ్య వయసు మహిళ. 
 
కుటంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడుపుతున్న ఆ మహిళ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుని ఆమెకు సెల్యూట్‌ చేసింది. ఈ ఊహించని పరిణామంతో ఆ ఆటోడ్రైవర్‌ షాకైంది. ఇదంతా కలా? నిజమా? అనే అయోమయంలో పడిపోయింది. ఆ తర్వాత తేరుకుని.. నమితతో సెల్ఫీ దిగడంపై సంబరపడిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్ఫర్మ్... బాహుబలి 3 ఉంది... మరి తెలుగోళ్లకి '3' చూసే ఓపిక ఉంటుందా...?!!