Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా ఇంటిచుట్టూ అపరిచితులు తిరుగుతున్నారు... చంపేస్తారేమో... నటి అపూర్వ ఫిర్యాదు

మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు శత్రువులు ఏర్పడుతారు. అలాంటి పరిస్థితే టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అపూర్వకు ఎదురైనట్లు తెలుస్తోంది. తనకు ప్రాణభయం ఉందని ఆమె పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాదులోని ఎస్ఆర్ నగ

నా ఇంటిచుట్టూ అపరిచితులు తిరుగుతున్నారు... చంపేస్తారేమో... నటి అపూర్వ ఫిర్యాదు
, మంగళవారం, 24 మే 2016 (11:26 IST)
మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు శత్రువులు ఏర్పడుతారు. అలాంటి పరిస్థితే టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అపూర్వకు ఎదురైనట్లు తెలుస్తోంది. తనకు ప్రాణభయం ఉందని ఆమె పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్లో పీఎస్ లో ఆమె చేసిన ఫిర్యాదు వివరాలను పరిశీలిస్తే... మొన్న మే 21న ఆమె ప్రయాణిస్తున్న కారును విజయవాడ-చౌటుప్పల్ జాతీయ రహదారిపై మరో కారు వేగంగా వచ్చి ఢీకొంది. 
 
ఈ ఘటనలో అపూర్వ కారు పూర్తిగా దెబ్బతిన్నది. దీనితో ఆ కారుకు అయ్యే ఖర్చును మొత్తం ఢీకొట్టిన కారు యజమానులు భరిస్తామని చెప్పి అంతా చేయించారు. ఐతే ఆ తర్వాత ఎందుకనో ప్రమాదం పైన తనకు బెదిరిస్తూ ఫోన్ కాల్స్ చేస్తున్నారనీ, పైగా తను నివాసం ఉంటున్న సిద్ధార్థనగర్ ఇంటి చుట్టూ అపరిచితులు తిరుగుతున్నారని భయపడుతోంది. వారేమైనా తనను చంపేస్తారేమోనని అనుమానంగా ఉందనీ, తనకు భద్రత కల్పించాలంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వెంత కాలంగా పనిచేస్తున్నావ్..