Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు చిత్రసీమలో కొత్త అధ్యాయం 'రుద్రమదేవి' : సుమన్

తెలుగు చిత్రసీమలో కొత్త అధ్యాయం 'రుద్రమదేవి' : సుమన్
, శుక్రవారం, 9 అక్టోబరు 2015 (16:39 IST)
"తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులైన కేసీఆర్ గారు 'రుద్రమదేవి' చిత్రానికి వినోదపు పన్ను మినహాయించడం స్వాగతించవలసిన అంశం. చారిత్రాత్మక చిత్రాలకు ఇలాంటి ప్రోత్సాహాలు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కాలంలో చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఈ తరహా చిత్రాలను తీయడానికి మరికొందరు ముందడుగు వేస్తారు" అని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. 
 
గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ నిర్మాణ విలువలతో రూపొందిన చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క టైటిల్ పాత్రలో నటించింది. అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు తదితరులు నటించిన ఈ చిత్రంలో ప్రతినాయకుడు హరిహరదేవుడు పాత్రలో సుమన్ నటించారు. నేడు విడుదలయిన చిత్రానికి వస్తున్న స్పందన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 
 
ఆయన మాట్లాడుతూ.. "చిత్రానికి ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన లభిస్తుంది. గుణశేఖర్ గారి కృషి, పట్టుదల వలన ఈ విజయం సాధ్యమైంది. చరిత్రపై ఎంతో పరిశోధన చేసి, ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించి చిత్రం తెరకెక్కించారు. తెలుగు చిత్రసీమలో ఈ చిత్రం కొత్త అధ్యాయం లిఖించింది. అనుష్క, అల్లు అర్జున్ అద్వితీయంగా నటించారు. నేను హరిహర దేవుడు పాత్రలో నటించాను. కాకతీయ సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించే పాత్ర. బాగా నటించావ్ అంటూ పలువురు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. దీనికి కారణం గుణశేఖర్ గారే. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు. మంచి చిత్రం ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu