Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వయస్సు మళ్లిన నటుల బాధలు ఇంతింత కాదయా!

వయస్సు మళ్లిన నటుల బాధలు ఇంతింత కాదయా!
, సోమవారం, 29 జూన్ 2015 (14:20 IST)
వయస్సు పైబడిన నటీనటులకు ఆదరణ లేదనేది సిని ఇండస్ట్రీలో తెలిసిందే. వీరి కోసం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఫించన్లు ఏర్పాటు చేసింది. అయితే మురళీ మోహన్‌ వుండగా.. వాటిని సరిగ్గా ఇవ్వలేదని కుదించారనే విమర్శలు వున్నాయి. ఆయన స్థానంలో వచ్చిన రాజేంద్రప్రాసద్‌ ఫించన్లపై శ్రద్ధ పెట్టాడు. దానికి అనుగుణంగా ఇటీవలే కొంతమందికి ఫించన్లు ఇచ్చాడు. పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో... స్టేజీ ఆర్టిస్టు నాగయ్య చేరాడు.
 
ఇతను 'వేదం' సినిమాలో... అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో నటించాడు. ఇతను దాచుకున్న డబ్బును అల్లు అర్జున్‌ కొట్టేస్తాడు. అక్కడ ఆ తర్వాత విషయం తెలిసి తిరిగి ఇచ్చేస్తాడు. అయితే.. ప్రస్తుతం నాగయ్య పరిస్థితి అలాగే వుంది. ప్రతి సినిమా ఓపెనింగ్స్‌ హాజరవుతూ వుంటాడు. 
 
కానీ వయస్సుకు తగ్గ పాత్రలు వుంటే ఇచ్చేవారు కొందరైతే... చూద్దాం అంటూ దాటవేసే వారు చాలామంది. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి దారుణంగా వుందని తెలిసింది. విషయం తెలిసిన మా అసోసియేషన్‌ ఏదైనా సాయం చేయడానికి ముందుకు వచ్చింది. తెలిసినవారి సినిమాల్లో అవకాశం వచ్చేలా చర్యలు తీసుకుంటామని మా పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu