Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రానాతో హిట్ కొట్టాల్సిందే.. భల్లాలదేవతో రొమాన్స్‌కు కాజల్ అగర్వాల్ కసరత్తులు!

ఎన్ని ఫ్లాపులొచ్చినా పట్టించుకునే ప్రసక్తే లేదని, అలాగే ఇప్పట్లో సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పే ప్రసక్తే లేదని చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అంటోంది. పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో సర్దా

రానాతో హిట్ కొట్టాల్సిందే.. భల్లాలదేవతో రొమాన్స్‌కు కాజల్ అగర్వాల్ కసరత్తులు!
, సోమవారం, 27 జూన్ 2016 (16:36 IST)
ఎన్ని ఫ్లాపులొచ్చినా పట్టించుకునే ప్రసక్తే లేదని, అలాగే ఇప్పట్లో సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పే ప్రసక్తే లేదని చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అంటోంది. పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించకపోయినా.. అవకాశాలకు ఢోకాలేదంటోంది. 
 
బాలీవుడ్ మూవీ ‘దో లఫ్జోంకీ కహానీ’ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో కాజల్ ఒత్తిడికి గురైందని తద్వారా.. కాజల్ అగర్వాల్‌ తన కెరీర్‌కు స్వస్తి చెప్పి త్వరలో పెళ్లి చేసుకోనుందనే వార్తలపై కాజల్ అగర్వాల్ ఫైర్ అయ్యింది. పెళ్ళికి తొందరలేదని.. అవకాశాలు మెండుగా వస్తూనే ఉన్నాయని చెప్పుకొచ్చింది.
 
ఫ్లాపుల గురించి పెద్దగా పట్టించుకోనని కాజల్ అంటోంది. కాగా తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న నక్షత్రం సినిమాలో అమ్మడు నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ భల్లాలదేవ రానా సరసన నటిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. అయితే భల్లాలదేవతో తొలిసారి నటించే కాజల్ అగర్వాల్ అతడితో రొమాన్స్ కోసం కసరత్తులు చేస్తుందని.. సన్నివేశాలను పండించేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఎలాగైనా హిట్ టాక్ కోసం రానాతో రొమాన్స్‌కు కాజల్ రెడీ అవుతున్నట్లు తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఒక మనసు'కేమైంది...? ఈగలు తోలుకుంటోందా...? నీహారిక ముద్దులు పెడితే...?