Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోలీవుడ్‌లో బిజీ బిజీగా మిల్కీ బ్యూటీ.. మరో భారీ ప్రాజెక్ట్‌కు సైన్.. ఆ నలుగురిని సంతృప్తి పరుస్తుందా..!

కోలీవుడ్‌లో బిజీ బిజీగా మిల్కీ బ్యూటీ.. మరో భారీ ప్రాజెక్ట్‌కు సైన్.. ఆ నలుగురిని సంతృప్తి పరుస్తుందా..!
, మంగళవారం, 25 ఆగస్టు 2015 (11:38 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న అందాల తార తమన్న. బాహుబలితో మంచి హిట్టు‌ను సొంతం చేసుకున్న ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు వరుస ఆఫర్లతో కోలీవుడ్‌లో బిజీ బీజీగా ఉంటోంది. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్‌కు సైన్ చేసిందట. ఇప్పటికే హీరో రవితేజ సరసన నటిస్తున్న బెంగాల్ టైగర్ సినిమా తమిళ వెర్షన్ షూటింగ్‌లో పాల్గొంటోంది. అదే సమయంలో నాగార్జున, కార్తీల కాంబినేషన్‌లో తెరకెక్కుకున్న మల్టీ స్టారర్‌లో కూడా నటిస్తోంది. 
 
మరో వైపు అక్టోబర్‌లో ప్రారంభం కానున్న బాహుబలి-2 సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఇంతా బిజీగా గడుపుతున్న తమన్న యంగ్ హీరో శింబు సరసన నటించేందుకు అంగీకరించిందట. ఆయన నటిస్తున్న కొత్త సినిమాకు డేట్స్ ఇస్తూ తమ్ము సైన్ చేసిందటని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం శింబు గౌతమ్ మీనన్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఆ షూటింగ్ ముగిసిన తర్వాత ఆయన దర్శకుడు సెల్వరాఘవన్ సినిమాలో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు. 
 
అందులో శింబు సరసన తమన్న నటిస్తుంది. మంచి రొమాంటింక్ లవ్ స్టోరీగా సిద్ధమవుతున్న ఆ సినిమాలో తమన్న లీడ్ రోల్‌లో కనిపిస్తుందని సమాచారం. మరి ఇన్ని ప్రాజెక్టు‌లను అంగీకరించిన తమ్ము ఆ నలుగురు హీరోలను ఎలా సంతృప్తిపరుస్తుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu