కుర్రహీరోలు, నడివయస్సు హీరోలకంటే వృద్ధులంటేనే తనకు ముద్దన్న నిర్ణయానికి ముమైత్ ఖాన్ వచ్చేసింది. విషయం ఏమంటే... ఎప్పటి నుంచో తాను హైదరాబాదులో ఓ ఆశ్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు చెపుతూ వచ్చేది. అదే వృద్ధాశ్రమం. తన నిర్ణయాన్ని ఆమె తన సన్నిహితులతో చెబితే వారు మంచి నిర్ణయమే తీసుకున్నావని అన్నారట.
ప్రస్తుతం నటీనటులలో చాలామంది నటన కాకుండా ఇతరత్రా వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. తాను చేస్తుంది సమాజసేవ అనే నిర్ణయానికి రావడం తనకు మనశ్శాంతిని కల్గిస్తోందని చెప్పింది. బాలీవుడ్‌కు చెందిన నటినైనప్పటికీ తనకు జీవితాన్నిచ్చింది టాలీవుడ్ కాబట్టి ఇక్కడే ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. పనిలోపనిగా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారి బాధ్యతలు కూడా నిర్వహించనున్నట్లు తెలియజేసింది.
ఇదంతా బాగానే ఉంది. మరి పెళ్లి చేసుకుని ఎప్పుడు స్థిరపడతారని అడిగితే... తనకు 30 ఏళ్లు దాటాక నచ్చినవాడు దొరికితే వెంటనే తాళి కట్టించుకుంటానంటోంది. కోటీశ్వరుడినో, దుబాయ్ షేక్‌నో చేసుకుని ఆ తర్వాత ఒంటరిగా జీవితాన్ని గడపడం ఇష్టం లేదనీ, తాను చెప్పినట్లు వినేవాడు తనకిష్టమైనవాడు అయితే బెటర్ అని మనసులో మాట చెప్పింది.