కథానాయకుల కుమారులు హీరోలుగా మారడం మామూలే. కానీ కుమార్తెలు నటీమణులుగా మారడం చాలా అరుదు. బాలీవుడ్‌లో చూసుకుంటే అనిల్ కపూర్, రిషీ కపూర్ కుటుంబాలకు చెందినవారు ఉన్నా టాలీవుడ్‌లో ఇంకా ఆ మార్పు రాలేదు.
ఇటీవలే కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ హీరోయిన్‌గా ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆ కోవలోనే మోహన్ బాబు కుమార్తె రాబోతోంది. ఇప్పటికే ఆమె పలు టీవీ షోలలో తన టాలెంట్‌ను నిరూపించుకుంది. ఇటీవల తన షూటింగ్‌పై ఆందోళనకారులు దాడి చేస్తే వారికి ధీటుగా సమాధానం చెప్పి మోహన్ బాబు కుమార్తె అనిపించుకున్నది.
ఇప్పుడు నటనను తన తండ్రి నుంచి పుణికి పచ్చుకుంటూ సినిమాల్లో నటించడానకి సిద్ధమవుతోంది. విదేశాల్లో సినిమాకు సంబంధించిన కోర్సును అభ్యసించింది కూడా. ఒక పక్క మోహన్ బాబు వారసులుగా మంచి విష్ణు, మనోజ్‌లు తమ సత్తా నిరూపించుకుంటున్నారు. కానీ వీరిద్దరికంటే ధీటుగా లక్ష్మీ ప్రసన్న కనిపించనున్నారు. లేడీ విలన్‌గా ఆమె నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
శృతి హాసన్, సిద్ధార్థ కాంబినేషన్‌లో కె. రాఘవేంద్రరావు నిర్మిస్తూ కె.ప్రకాశరావు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో లక్ష్మీ ప్రసన్న నటిస్తోంది. ఈ చిత్రానికి యోధ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.