మంచిగా మాట్లాడేవారంటే ఇష్టమని గ్లామర్ క్వీన్ నవనీత్‌కౌర్ చెబుతోంది. మంచితనమనేది మాటల్లోనే తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని అంటోన్న నవీనీత్ కౌర్.. పంజాబీ, తమిళ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉందని చెబుతోంది. మొట్టమొదటి తెలుగు చిత్రం షూటింగ్‌లో ప్రకాష్‌రాజ్ తనను 'రండి..రండి..' అని పిలిస్తే... నాకు చిర్రెత్తింది.
మా భాషలో "రండి" అంటే వేరే అర్థముంది. తిడుతున్నాడని కోపంగా మాట్లాడాను. కానీ తెలుగులో "రండి" అనేమాటలో ఉన్న ఆప్యాయతను చూసి ఆశ్చర్యపోయాను. అని నవనీత్ కౌర్ చెప్పింది.
అలాగే బాడీ సీక్రెట్ గురించి చెబుతూ.. రోజూ జాకింగ్ డాన్స్ చేస్తుంటా... అంతకంటే సీకెట్ర్ లేదు. ప్రస్తుతం నాలుగేళ్ళవరకు పెళ్లి ఆలోచనలేదు. అబ్బాయి గురించి కూడా లేదు. ఆ తర్వాతే పెండ్లిగురించి ఆలోచిస్తానని చెబుతున్న నవనీత్ .. పాత్రమేరకు బికినీ వేయడంలో తప్పులేదని చెబుతోంది.