"మెగాస్టార్" జూ. ఎన్టీఆర్: పగలబడి నవ్వుతున్న చిరు ఫ్యాన్స్
మెగాస్టార్ అంటే చటుక్కున గుర్తుకు వచ్చేది ఎవరూ... అంటే చిన్న పిల్లాడి దగ్గర్నుంచి వృద్ధుల వరకూ చెప్పే మాట చిరంజీవి అనే. కానీ ఆయనకున్న ఆ మెగాస్టార్ ఇమేజ్ ట్యాగ్ లైన్‌ను ఓ దినపత్రిక జూనియర్ ఎన్టీఆర్‌కు తగిలిస్తూ వార్త రాసింది. ఈ వార్తను చూసిన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు విరగబడి నవ్వుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌తో జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్‌ను పోల్చి చెప్పడాన్ని అత్యంత హాస్యాస్పదమైన అంశంగా కొట్టిపారేస్తున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం మా జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్‌ను మించిపోయి చాన్నాళ్లయిందనీ వాదిస్తున్నారు. ఇదిలావుంటే ఫ్యాన్స్ మధ్య లేనిపోని ఇమేజ్ గొడవలు సృష్టించటం తగదని సినీ విశ్లేషకులు అంటున్నారు.