"ఎవరైనా ఎప్పుడైనా" అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బ్యూటీ విమలా రామన్ గరం గరంగా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని అంటోంది. తను నటిస్తున్న తాజా చిత్రంలో బికినీ వేసుకుని నటించడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... విదేశాలలో పెరిగిన ఓ అమ్మాయి సంప్రదాయ దుస్తులు వేసుకుంటుందని ఎలా అనుకుంటున్నారూ...? అని ఎదురు ప్రశ్నిస్తోంది.
మోడ్రన్ డ్రెస్సులే కాదు... తన దృష్టిలో బికినీ వేసుకోవడం కూడా పెద్ద డీల్ కాదని కొట్టి పారేస్తోంది. మరి ఎటువంటి దుస్తులు ధరించి నటిస్తే పెద్ద విషయమనుకుంటుందో ఈసారి అడిగి తెలుసుకుందాం.
ప్రస్తుతం తను దక్షిణాది భాషా చిత్రాలన్నిటిలో నటిస్తున్నానని సంబరంగా చెపుతోంది విమలా రామన్. ముఖ్యంగా కన్నడ భాషలో తను చేస్తున్న పాత్రకు ఖచ్చితంగా అవార్డు వస్తుందని చెపుతోంది. మరి తెలుగులో కూడా అవార్డు దక్కించే పాత్రలే చేయొచ్చు కదా... బికినీలతో నటించడం ఎందుకో...?!!